బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే.. చివరికి ప్రాణమే పోయింది?

praveen
అధునాతన  టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతున్న మనిషి జీవనశైలి ఇక ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేటి రోజుల్లో జంక్ ఫుడ్ కి అలవాటు పడటం అంతేకాదు కూర్చున్న చోట నుంచి కనీసం పక్కకు లేచేందుకు కూడా అవకాశం లేదు గంటల  తరబడి ఒకే చోటు కూర్చునే ఉద్యోగాలు ఉండటంతో ఎంతోమంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఇక జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి వ్యాయామం కి దూరంగా ఉండి ఇక ఊబకాయలుగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఊబకాయం వచ్చిన తర్వాత చివరికి బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇలా బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటున్నారు అని చెప్పాలి. కొంతమంది అయితే వేగంగా బరువు తగ్గడానికి అతిగా కసరత్తులు  చేసి చివరికి ప్రాణాలు మీ దగ్గర తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి కోవలోకి చెందిన ఘటన గురించే అని చెప్పాలి. ఆ యువతి వయసు 21 ఏళ్ళు. కానీ ఆమె బరువు 156 కిలోలు. చివరికి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే ఆమె ప్రాణమే పోయింది.

 ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. కుయ్ హువా అనే 21 ఏళ్ళ యువతి సోషల్ మీడియా ఇన్ఫ్లోయెన్సర్ 90 కిలోల బరువు తగ్గే లక్ష్యంతో శాంగ్టి ప్రావిన్స్ లోని ఒక వెయిట్ లాస్ క్యాంప్లో చేరింది. అయితే మొదటి ప్రయత్నంలో 27 కిలోల బరువు తగ్గింది. అయితే బరువు తగ్గడం కోసం విపరీతమైన కసరతులు చేసింది. అదే సమయంలో ఇక ఆహారం తగినంత తీసుకోలేదు. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. అతిగా వర్కౌట్ తో చేసిన చివరికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఇక ఈ విషయం ఆమె ఫాలోవర్లోకి తెలిసి అందరూ విషాదంలో మునికి  పోయారు.. అతివేగంగా బరువు తగ్గడం గుండె మీద ప్రభావం చూపుతుందని పలువురు నేటిజన్స్ మండిపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: