పెరిగిన ధర.. చపాతి కూడా భారమైంది?

praveen
ప్రాణాలు తీసే కరోనా వైరస్ అన్ని దేశాల్లో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు అన్నీ కూడా సంక్షోభంలో కోరుకుపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కరోనా కారణంగా వచ్చిన సంక్షోభం నుంచి బయటపడితే.. మరికొన్ని దేశాలు మాత్రం అంతకంతకు సంక్షోభం ఊబిలో కూరుకుపోతూనే ఉన్నాయి అని చెప్పాలి.  ఇలా ఆర్థిక సంక్షోభంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలలో భారత పొరుగు దేశం అయిన పాకిస్తాన్ కూడా ఉంది అని చెప్పాలి.

 అక్కడ సంక్షోభం ఎంతలా పెరిగిపోయిందంటే ఇక ఆర్థిక మాంద్యం దెబ్బకు మాల్స్ మార్కెట్స్ కళ్యాణమండపాలు సహా అన్ని కార్యాలయాలు కూడా దెబ్బకు మూతపడ్డాయి అని చెప్పాలి. భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడం.. ఇక ఎలాంటి ఆర్డర్లు లేకపోవడంతో చివరికి మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇక నిత్యవసర ధరలు కూడా ఆకాశాన్ని అంటతు ఉన్నాయి.  ఇక అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత కూడా ప్రజల పాలిట శాపంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి వచ్చిన డబ్బుతో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే పాకిస్తాన్లో రోటి తయారికి గోధుమలు ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే పాకిస్తాన్లో లాహోర్ లోని ఒక మార్కెట్లో మాల్స్ లో కూడా ఎక్కడ పిండి దొరకడం లేదు. దీంతో 15 కిలోల గోధుమ పిండి బస్తాకు 2050 ధర పెరగడం గమనార్హం. కిలో చికెన్ 650 రూపాయలు ఉండగా.. పెరిగిన ధరల తో సామాన్య ప్రజలు బెంబలెత్తి పోతున్నారు. అయితే సామాన్య ప్రజలకు కిలో గోధుమపిండి 130 రూపాయలకు దొరకపోతుంది అని చెప్పాలి. దీనిబట్టి ఇక అక్కడ ప్రతిరోజు తినే చపాతి కూడా భారంగా మారిపోనుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: