ఆ గ్రామానికి జాక్ పాట్.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 7.5 కోట్లు?
ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక గ్రామానికి జాక్ పాట్ తగిలింది. దీంతో గ్రామంలో ఉన్న 65 మంది రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోయారు. ఏకంగా ఒక్కొక్కరి అకౌంట్లో 7.5 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి అని చెప్పాలి. దీంతో ఆ ఊరు మొత్తం ధనిక దేశంగా మారిపోయింది. అది మన దేశంలో కాదులేండి బెల్జియం లో. బాలెన్స్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అల్మెన్ అనే గ్రామానికి జాక్పాట్ తగిలింది. 65 మందికి కలిపి ఒక్కొక్కరి అకౌంట్లో 7.5 కోట్లు జమ అయ్యాయి అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక్కొక్కరు బెల్జియం కరెన్సీ ప్రకారం 138 రూపాయలు వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. అయితే ఇలా కొన్నవారు తమకు అంత పెద్ద మొత్తంలో లాటరీ వరిస్తుందని మాత్రం ఊహించలేదు.
లాటరీ నిర్వాహకులు ఇక లాటరీ తీయగా అల్మెన్ గ్రామస్తులు కొనుగోలు చేసిన టికెట్స్ జాక్పాట్ తగిలింది. ఏకంగా 123 మిలియన్ల పౌండ్లు బహుమతిగా గెలుచుకున్నారు. అంటే భారత కరెన్సీలో 1200 కోట్లకు పైగానే ఇక ఈ మొత్తాన్ని 165 మందికి పంచితే ఒక్కొక్కరి అకౌంట్లో దాదాపు 7.50 కోట్లు జమ అయ్యాయి అని చెప్పాలి. దీంతో ఇక ఆ 165 మంది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. గత కొన్నేల్లా నుంచి డబ్బులు వెచ్చించి ఇలా లాటరీ టికెట్లు కొంటున్నామని కానీ ఇన్నేళ్లకు తమకు అదృష్టం వరించింది అంటూ గ్రామస్తులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు అని చెప్పాలి.