అయ్య బాబోయ్.. 16 ఏళ్ళకే ఓటు హక్కు?
అయితే ఇక ప్రతి మనిషి జీవితంలో అన్నింటికంటే ఎంతో శక్తివంతమైంది ఓటు హక్కు అని అందరూ చెబుతూ ఉంటారు. ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటే సరైన పాలకులను ఎన్నుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. అయితే మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి ఇక తమ పాలకుడిగా ఎన్నుకునేందుకు ప్రజాస్వామ్యం ప్రకారం ఛాన్స్ ఉంది అని చెప్పాలి. కానీ ఇక పదహారేళ్ల వయసు కలిగిన వారు కూడా ఓటు వేయబోతున్నారు.
అయితే ఇది మన దేశంలో కాదులేండి.. ఏకంగా న్యూజిలాండ్లో ఓటు హక్కు వయస్సును తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం 18 ఏళ్ల వయస్సు వారికి మాత్రమే ఓటు హక్కు ఉండగా దానిని 16 ఏళ్లకు తగ్గించేందుకు ఆలోచన చేస్తుందట అక్కడి ప్రభుత్వం. కాగా ఇప్పటికే కొన్ని దేశాలు పదహారేళ్లకే ఓటు హక్కు కల్పిస్తూ ఉన్నాయి. అయితే 18 ఏళ్ల వయసు వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం అంటే యువతపై వివక్ష చూపించడమే అంటూ అక్కడి సుప్రీంకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించింది. అయితే ఓటు హక్కు వయసు తగ్గింపుకు న్యూజిలాండ్ పార్లమెంటులో 75 శాతం మంది సభ్యుల మద్దతు అవసరం అని చెప్పాలి.