పాప్ సింగర్ లా మారేందుకు.. 18 సర్జరీలు.. కాని చివరికి?

praveen
వెయ్యి వేయి విధాలు అని అంటూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి ఎంతోమందిలో ఉంటుంది అన్నది మాత్రం నిజమే అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వేరొకరిని అనుకరించాలి అని భావించి ఇటీవల కాలంలో ఎంతోమంది విచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీల విషయంలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలు అయితే అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి. దేవుడు ఇచ్చిన అందంతో సంతోషపడకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఎంతో మంది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

 కొంతమంది ఇక తమ ముఖం లేదా శరీరంలోని భాగాలను ప్లాస్టిక్ సర్జరీల ద్వారా తమకు నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటే కొంతమంది వేరొకరిలా రూపు రేఖలు మార్చుకోవాలని భావించి ప్లాస్టిక్ సర్జరీల పేరుతో ఎన్నో సాహసాలు చేసి చివరికి వికృతమైన రూపాలను తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన గురించి లండన్ కు చెందిన ఒక వ్యక్తి ఏకంగా  కొరియన్ పాప్ సింగర్ లాగా కనబడాలని ఎంతగానో ఆశపడ్డాడు.

 ఈ క్రమంలోనే ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు అని చెప్పాలి. ఏకంగా తన ముఖానికి 18 సర్జరీలు చేయించుకున్నాడు. ఓలి లండన్ అనే వ్యక్తి ఇలా ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేసి సర్జరీ చేయించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇన్ని కోట్లు పెట్టి సర్జరీలు చేయించుకొని కొరియన్ సింగర్ లాగా తన మొఖాన్ని మార్చుకున్న సదరు వ్యక్తి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం గమనార్హం. తాను చేసింది పెద్ద తప్పు అని అర్థమైందని.. ఇక ఇప్పుడు మళ్లీ తన పాత రూపానికి మారి బ్రిటిష్కర్ గా మారాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: