లక్షలు సంపాదిస్తున్న కుక్క.. ఇంతకీ ఏం చేస్తుందో తెలుసా?

praveen
ఇటీవలకాలంలో కుక్కలను పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఎంతోమంది ఇక ట్రెండ్ ఫాలో అవ్వడానికి తమకు ఇష్టమైన బ్రీడ్ కుక్కలను తెచ్చుకొని ఇక పెంచుకుంటూ ఉన్నారు. ఇక మనుషుల మీద కంటే కుక్కల మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలా ప్రతి ఒక్కరు కూడా కుక్కలను పెంచుకోవడం సాధారణంగా కనిపిస్తూనే ఉంది. అయితే ఇలా పెంపుడు కుక్కలు కూడా యజమానులు పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటూ కొన్ని కొన్ని సార్లు యజమానుల ప్రాణాలను కాపాడటం లాంటివి కూడా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే అందరిలాగానే ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. కానీ ఆ కుక్క చేస్తున్న పని ద్వారా మాత్రం సదరు వ్యక్తి ఏకంగా లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉండడం గమనార్హం. అదేంటి కుక్కను పెంచుకోవడం వరకు ఓకే గాని కుక్క చేస్తున్న పని ద్వారా యజమానికి లక్షల రూపాయలు రావడం ఏంటి.. అదేమైనా మనిషా పని చేసి డబ్బులు సంపాదించడానికి అని అనుకుంటున్నారు కదా.. మనిషిలాగా ఆ కుక్క పని చేయడం లేదు కానీ లక్షల రూపాయలు మాత్రం యజమానికి సంపాదించి పెడుతుంది అని చెప్పాలి.

 ఇంతకీ ఆ కుక్క ఎలా సంపాదిస్తుందో తెలుసా.. ఏకంగా పెయింటింగ్ వేసి. ఇప్పటివరకు చింపాంజీలు పెయింటింగ్ వేయడం చూసాము. కానీ ఇక్కడ కుక్క మాత్రం పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విన్సెంట్ వన్ గోహ్గా అనే పిలువబడే ఒక కుక్క డచ్ ఆర్టిస్టు సహాయంతో 9 ఏళ్ల నుంచి పెయింటింగులు వేస్తూ లక్షల సంపాదిస్తుంది. ఇక ఇప్పుడు ఆ కుక్క వేసిన పెయింటింగ్ లు అన్ని అమ్ముడుపోవడంతో ఇక ఈ శునకం కాస్త సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఇప్పటివరకు ఈ శునకం 30 పెయింటింగ్లు వేయగా అన్ని అమ్ముడుపోయాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: