వ్యక్తి ముక్కును బట్టే.. పురుషాంగ పరిమాణం.. నిజమేనా?

praveen
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ సెక్స్ జీవితంలో ఎన్నో అనుమానాలు కలిగి ఉంటున్నారు. కానీ వాటిని కొంతమంది మాత్రమే బయటికి చెప్పడానికి ధైర్యం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జననాంగ పరిమాణాల పై ఇప్పటికే ఎంతోమంది లో అనుమానాలు ఉంటాయి. ఇలాంటి అనుమానాలను ఎంతో మంది నిపుణులు నివృత్తి చేస్తూ ఉంటారు.. అదే సమయంలో ఇక ఇలాంటి విషయాలపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సరికొత్త అధ్యయనం చేస్తూ సరికొత్త విషయాలను కనుగొనడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు పురుషుల్లోని జననాంగం  పరిమాణం గురించి షాకింగ్  విషయాన్ని కనుగొన్నారు.

 పురుషుల్లో ఉండే ముక్కు సైజును బట్టి వారి జననాంగ పరిమాణం కూడా ఉంటుందని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తుల పురుషాంగం కూడా అదే తీరున ఉంటుందని అంటున్నారు. క్యూటో ఫ్రీఫ్రెక్చువల్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేపట్టారు.. పై రెండు శరీర భాగాల మధ్య ప్రత్యేకమైన సహసంబంధం ఉంటుంది అన్న విషయం ఈ అధ్యయనంలో వెల్లడైంది అని చెప్పాలి. ఇది పురుష శరీర నిర్మాణ శాస్త్రం కి సంబంధించిన మెడికల్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది అని చెప్పాలి. పొడవాటి ముక్కు కలిగి ఉన్న వ్యక్తులు పురుషాంగం కూడా నిటారుగా ఉన్నప్పుడు 5.3 ఇంచుల మీద ఉండే అవకాశం ఉందని అదే చిన్న ముక్కు ఉన్న పురుషులు పురుషాంగం  4.1 ఇంచులు మాత్రమే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు.

 126 మంది పురుషుల మృతదేహాలను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు శాస్త్రవేత్తలు. మరణించిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ అధ్యయనం నిర్వహించారు.. అచేతనావస్థలో ఉన్న వారు కావడంతో పురుషాంగాలను చేతులతో లాగి కొలతలు తీసుకున్నారు. అయితే ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జపాన్ శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: