జాక్ పాట్.. రూ. 10,588 ఓట్లు గెలుచుకున్నాడు?

praveen
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా హీరోలకు ఒక్కో సినిమాతో ఓవర్నైట్ స్టార్ డమ్ వచ్చినట్లుగానే మనకి కూడా ఓవర్ నైట్ లో కోట్ల రూపాయలు వచ్చి కోటీశ్వరుడు గా మారి పోతే ఎంత బాగుంటుందోఅని ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇలా డబ్బులు సంపాదించడం కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా డబ్బు సంపాదించేందుకు లగ్జరీ లైఫ్ గడిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మందికి అనుకోని విధంగా అదృష్టం వరిస్తూ కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. ఏదో టైం పాస్ కోసం కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కోట్ల రూపాయలు పలుకుతూ ఇక అనుకోని విధంగా అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది.  ఇక గత కొంత కాలం నుంచి ఇలాంటి తరహా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ వార్త అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి.

 ఇప్పటివరకూ ఎంతోమంది లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. ఇలా ఒకటి లేదా రెండు కోట్లు గెలుచుకోవడం మహా అయితే ఒక యాభై కోట్లు గెలుచుకోవడం చూశాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అంతకు మించి అనే రేంజ్ లోనే జాక్పాట్ కొట్టేశాడు. ఏకంగా పది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా  మారింది. అమెరికాలోని ఒక వ్యక్తికి భారీ జాక్పాట్ తగిలింది  లాటరీలో 133.7 కోట్ల డాలర్లు లాటరీ గెలుచుకోగా.. ఇది మన కరెన్సీలో 10,558 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.  గత ఐదేళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద జాక్పాట్ అన్న విషయం తెలుస్తుంది. ఇక అమెరికా దేశ చరిత్రలోనే మూడో అతిపెద్ద జాక్పాట్ కావడం గమనార్హం. ఇలినాయ్ రాష్ట్రంలోని కుక్ కౌంటీ లోని ఒక స్టోర్ మెగా మిలియన్ లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ జాక్పాట్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: