చైనాకు మరో తలనొప్పి.. వెలుగులోకి కొత్త వేరియంట్?

praveen
చైనా కారణంగా వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ మొన్నటి వరకు ప్రపంచ దేశాలలో సృష్టించిన సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర రాజ్యాలను సైతం ఏకంగా గడగడ వణికించింది కరోనా వైరస్. ఈ క్రమంలోనే ఈ కరుణ వైరస్ ఎప్పుడు తగ్గుతుందా ప్రశాంతంగా ఎప్పుడు బ్రతుకుతామా అని ప్రపంచ ప్రజానీకం మొత్తం కంటి మీద కునుకు లేకుండా భయపడుతూనే బ్రతికింది. ఇలా మొన్నటి వరకు ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టించిన కరోనా వైరస్ ఇక ఇప్పుడు పుట్టినిల్లు చైనాలో అదే పరిస్థితి తీసుకు వస్తుందని తెలుస్తోంది.

 కొంతకాలం నుంచి చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే చైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జీరో పాలసీ పేరుతో కొన్ని కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాలలో కూడా లాక్డౌన్ గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ  పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక కొత్త వేరియంట్ను పుట్టుకొస్తున్న నేపథ్యంలో అటు డ్రాగన్ కంట్రీ కూడా గజ గజ వణికి పోవాల్సినా పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇటీవలే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది అని తెలుస్తుంది. ఓమిక్రాన్ సబ్ వేరియంట్.. B. A. 5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇటీవల అక్కడి ఆరోగ్య  అధికారులు తెలిపారు.

 విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నమూనాలో ఇక వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపారు వైద్యాధికారులు.  ఇటీవలే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో షాంగై  నగరంలో లాక్డౌన్ ఎత్తివేశారు. అయితే మళ్లీ కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక  అక్కడ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కాగా ఇప్పటివరకు చైనాలో 2,26,610 కరోనా కేసులు నమోదు కాగా 5226 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తుంది కానీ అటు ప్రజల ఇబ్బందులను మాత్రం పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: