అమెరికాకు షాక్.. రష్యా నుండి అవి దిగుమతి?

praveen
అమెరికా వద్దు వద్దు అని చెబుతున్నా రష్యా మాత్రం చిన్న దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో మెరుపు దాడులు నిర్వహించి అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది. ఇక రష్యా యుద్ధం కారణం గా అటు ఉక్రెయిన్లో సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయం లోనే ఉక్రెయిన్ కు మద్దత్తు గా ఉంటామూ అంటూ చెప్పిన అమెరికా అటు ఆయుధ సహకారం అందించక పోయినప్పటికీ రష్యా పై ఆర్థికపరమైన యుద్ధం మాత్రం చేసింది అనే చెప్పాలి. రష్యాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంది.

 కేవలం అమెరికా అన్ని సంబంధాలను తెంచుకోవడమే కాదు ఇక అమెరికా మిత్ర దేశాలు నాటో యూరోపియన్ యూనియన్ లో ఉన్న సభ్య దేశాలు అన్ని కూడా రష్యా పై ఆంక్షలు విధించాలని రష్యా నుంచి ఎలాంటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చేసేందుకు వీలు లేదు అంటూ సూచించింది. ఈ క్రమంలోనే అమెరికా చెప్పినట్లుగానే తాము ముందుకు సాగుతున్నాం అంటూ అటు ప్రపంచ దేశాలు చెబుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ వాస్తవానికి జరుగుతుంది మాత్రం మరోలా ఉంది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

 ప్రస్తుతం రష్యా నుంచి గోధుమలను పలు దేశాలు భారీ స్థాయిలో  దిగుమతి చేసుకుంటున్నాయి అని తెలుస్తోంది. ఏకంగా ఈజిప్ట్ 4.4 మిలియన్ టన్నుల గోధుమలు దిగుమతి చేసుకుందట, ఆఫ్రికా 2.2 మిలియన్ టన్నులు గోధుమలు, ఆఫ్రికా 1.1 మిలియన్ టన్నులు మిడిల్ ఈస్ట్  ఆఫ్రికా 1.4 మిలియన్ టన్నులు, ఏషియా 1.5 మిలియన్ టన్నులు  గోధుమలను దిగుమతి చేసుకున్నట్లు ఇటీవలే నివేదికలు చెబుతున్నాయి. పేరుకు మాత్రం రష్యాపై నిబంధనలు విధించామూ అని చెబుతూనే ఇక ఇస్లామిక్ కంట్రీస్ కూడా  రష్యా నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటున్నాయ్ అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: