రష్యాను వదిలి నాతో రా.. ఇండియాకు పిలుపు?
ఇలా ఇటీవల కాలంలో భారత్ దౌత్యవేత్త పరంగా ముందుకు సాగుతున్న తీరు ఇక భారత విదేశాంగ విధానం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా భారత్ ఎంతో వ్యూహాత్మక ధోరణితో వ్యవహరించింది. ఉక్రెయిన్ కి మద్దతు పలుకుతున్న అమెరికా సహా నాటో దేశాలకు సపోర్ట్ చేయకుండా మరోవైపు రష్యా కు సపోర్ట్ చేయకుండా తటస్థ ధోరణితో వ్యవహరించింది. ఈ క్రమంలోనే రెండు దేశాలు యుద్ధం విరమించి శాంతియుతంగా చర్చించుకోవాలి అంటూ సలహా ఇచ్చింది.
ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు అమెరికా తమకు మద్దతు తెలపడం లేదని పలు మార్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం చేసింది. భారత్ మాత్రం పట్టించుకోలేదు. రష్యాతో g-77 ఆలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వెండిస్ షేర్మన్ సూచించారు. అమెరికా-భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని పెంచుకునేందుకు మరింత ఆస్కారం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా ఆస్ట్రేలియా జపాన్ లతో కూడిన క్వాడ్ కూటమిలో సభ్యత్వం ఉన్న భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు అంటూ సలహా ఇచ్చారు ఇలా రష్యన్ వదిలేసి నాతో రా అంటూ డైరెక్ట్ గా నే చెప్పింది అమెరికా.