తాలిబన్లు మరో సంచలన నిర్ణయం.. బుద్ధి చూపించారుగా?

praveen
ఆఫ్ఘనిస్థాన్లో ప్రజాస్వామ్యాన్ని మంట తెలుపుతూ  తాలిబన్లు  అధికారం లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏకం గా ఆయుధాలు చేత పట్టి తమకు ఎదురు తిరిగిన వారందరి ప్రాణాలు తీస్తూ దారుణం గా వ్యవహరించారు తాలిబన్లు. అయితే తమ ప్రజలందరికీ స్వేచ్ఛాయుత జీవితాన్ని కల్పిస్తామని చెబుతూ ఎన్నో మాయ మాటల తో నమ్మించారు. చివరికి ఎన్నో అరాచకాలు తర్వాత పాకిస్తాన్లో అధికారాన్ని చేపట్టారు తాలిబన్లు. అయితే అధికారం లోకి వచ్చిన తర్వాత మాత్రం తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకీ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది అన్న విషయం తెలిసిందే.

 ఎందుకంటే తాము అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ మాట ఇచ్చిన తాలిబన్లు అందరినీ బానిసలుగా మార్చుకున్నారు. ముఖ్యం గా మహిళలను కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేస్తూ ఇక వారి ఉద్యోగాలు అన్నింటినీ కూడా తొలగించారు తాలిబన్లు. అయితే ఇక అటు మహిళలు చదువు కోడానికి వీలు లేదు అంటూ ఎన్నో రోజుల నుంచి తాలిబన్లు స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది.. కానీ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించడం తో ఇక చదువుకునే అవకాశం ఇస్తున్నాము అంటూ చెప్పారు.

 కానీ ఇప్పుడు వారి వక్రబుద్ధి బయటపెట్టారు తాలిబన్లు. హైస్కూలు విద్యను అభ్యసించేందుకు బాలికలను అనుమతించడం లేదు అంటూ ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన తాలిబన్లు ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నాము అని చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలకు చదువుకునేందుకు అనుమతి లేదు అంటూ తేల్చి చెప్పారు. ఆరో తరగతి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాలిబన్ల  నిర్ణయంతో బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: