మిమ్మల్ని ఏం చేయను.. రండి చర్చించుకుందాం : జెలెన్ స్కీ

praveen
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర రీతిలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై ఎడతెరిపి లేకుండా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడుతూ అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తోంది. ఉక్రెయిన్ లో ఉన్న ప్రధాన నగరాలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు ముందుకు చొచ్చుకు పోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఉన్న ఎన్నో నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది అని తెలుస్తోంది. బాంబులు క్షిపణులు ఇలా రష్యా దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలతో బీకర రీతిలో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది.

  ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తొమ్మిది రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరక పోవడం గమనార్హం. అయితే యుద్ధం మొదలైన తర్వాత రోజు ఇరు దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులు చర్చలు జరిపారు. కానీ ఇక ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శాంతి చర్చలు కాస్త విఫలమయ్యాయి. అయితే చర్చలకు రావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చినా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ తమ డిమాండ్లకు లొంగి పోవాల్సిందే అంటూ పట్టుబట్టుకుని కూర్చున్నారు.

 ఈ క్రమం లోనే ఈ మారణహోమాన్ని ఆపేద్దాం ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు సైనికులు చనిపోతున్నారు శాంతియుతంగా చర్చించుకొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకుందాం అంటూ ఇటీవల మరోసారి అభిప్రాయం వ్యక్తం చేశారు జెలెన్ స్కీ. పుతిన్ తో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జెలెన్ స్కీ రండి నాతో కూర్చుని చర్చించండి.. మనిద్దరం కలిసి కూర్చొని చర్చించుకుందాం.. రెండు దేశాల మధ్య వివాదాలు పరిష్కరించకుందాం.. మిమ్మల్ని ఏమీ చేయను భయపడకండి అంటూ ఒక వైపు చురకలు అంటిస్తూ నే చర్చలకు సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: