ఎంత కక్ష : ట్రంప్ ఉన్నప్పుడు అలా.. బైడెన్ విషయంలో ఇలా?

praveen
అగ్రరాజ్యమైన అమెరికా అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. ఇప్పటికే అమెరికా లో ఓమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో మరో వైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతు ఉండడం మాత్రం ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతుంది అన్నది అర్ధమవుతుంది. ఇక ప్రతిరోజు అమెరికాలో ఆరు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటం చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో అగ్రరాజ్యం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు నిపుణులు.

 ఇక ఇటీవలే నిపుణులు చెబుతున్న గణాంకాల ప్రకారం అగ్రరాజ్యమైన అమెరికా లో ప్రతి 3 సెకన్లకు ఒక కేసు నమోదు అవుతూ ఉండటం గమనార్హం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. అయితే అమెరికాలో ఇంతలా కేసులు పెరిగిపోతున్న  అక్కడ మీడియాలో మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో లక్షకు పైగా కేసులు వెలుగు లోకి వచ్చినప్పుడు ట్రంప్ అసమర్థత కారణంగానే అమెరికాలో కేసులు పెరిగిపోతున్నాయని.. సరైన చర్యలు తీసుకోకపోవడం వలన ఎంతో మంది  బలవుతున్నాయి అంటూ అక్కడి మీడియా దుమ్మెత్తిపోసింది.

ఇక ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కథనాలు ప్రచురించాయి. ఒకరకంగా కరోనా వైరస్ సమయంలో మీడియా చేసిన విమర్శల  కారణంగా ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాను అని టాక్. కానీ ఇప్పుడు మాత్రం ఒకప్పటితో పోలిస్తేమూడు రెట్లు ఎక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో దాదాపు ప్రతి రోజూ ఆరు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయినా అక్కడి మీడియా మాత్రం దీనిని పెద్దగా చూపించడం లేదు. ప్రపంచం మొత్తం అమెరికాలో వెలుగులోకి వస్తున్న కేసులను చూసి భయపడుతూ ఉంటే అక్కడి మీడియా మాత్రం ఇది ఒక పెద్ద వార్త కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ట్రంప్ విషయంలో కక్షపూరితంగా ఇప్పుడు బైడెన్ విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: