విదేశాలకు వెళ్లే వారు ఈ విషయాలు మర్చిపోకండి?

VAMSI
కరోనా లాంటి విపత్కరమైన మరియు ప్రాణాంతకమైన సమయంలో ప్రపంచమంతా భయం గుప్పిట్లో చిక్కుకుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే అంత కోలుకుంటున్నాము. మళ్ళీ మాములు జీవిత విధానానికి అలవాటు పడుతున్నాము. వివిధ కారణాల చేత విదేశాలకు వెళ్లే వారు కూడా దానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు మరియు అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన రూల్స్ ను తరచూ మారుస్తున్నారు. అయితే ప్రయాణికులు సైతం మారుస్తున్న రూల్స్ సరిగా తెలుసుకోకుండా ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులు పడకూడదు అంటే ముందు గానే అన్ని రూల్స్ ను తెలుసుకుని అన్ని అరెంజ్ చేసుకుని వెళితే మీ అంతర్జాతీయ ప్రయాణం సవ్యంగా సాగుతుంది.
* ముందుగా కరోనా నుండి రక్షణ పొందడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. మీరు వేసుకున్నారా లేదా అని తెలియడానికి రెండు డోసుల వ్యాక్సిన్ అయిన తర్వాత వాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
* మీ పాస్ పోర్ట్ తో కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్ ను లింక్ చేయాలి. ఇలా లింక్ చేయడం వలన మీ పూర్తి వివరాలు ఎయిర్ లైన్స్ వారికి అందుబాటులో ఉంటాయి.
* మీరు ప్రయాణించే రోజుకు కనీసం 72 గంటల ముందు మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ వచ్చిన రిపోర్ట్ ను మీ వెంట తీసుకు వెళ్ళాలి.
* వీసా లలో ఏమైనా మార్పులు చేశారా లేదా తెలుసుకోండి. మీరు ఎంత సమయం లోపు ఎయిర్ పోర్ట్ కు రావాలి అనేది ముందే అడిగి తెలుసుకోండి.
* ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాస్క్ తీయకండి.
* మీరు వెళ్ళవలసిన దేశం ఏమైనా కొత్త రూల్స్ ను తెచ్చిందా అనే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండండి.
ఇలా పలు కీలక విషయాలను తెలుసుకుని ప్లాన్ చేయండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI

సంబంధిత వార్తలు: