పాక్ ప్ర‌ధానికి షాక్ : తాలిబ‌న్లు అంత మాట అనేశారేంటి?

Dabbeda Mohan Babu
ఆఫ్ఘ‌నిస్థాన్ దేశాన్ని తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న నాటి నుంచి అక్క‌డ వారు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే వర‌కు తాలిబ‌న్ల కు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌ద్ధుతు ఇస్తూ వ‌చ్చారు. అలాగే తాలిబ‌న్లు ఆఫ్ట‌నిస్థాన్ లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకుంటే పాక్ లో ఉన్నఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను అన్నింటిని ఆఫ్టాన్ కు త‌ర‌లించ వ‌చ్చు అని కూడా ఇమ్రాన్ అనుకున్నారు. అందు కోసం తాలిబ‌న్ల తో చాలా స‌న్నితంగా ఉన్నారు. తాలిబ‌న్లు ఆఫ్ఘాన్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా వారికి మ‌ద్ధ‌తు తెలిపాడు. ఆఫ్ఘనిస్థాన్ ను పాక్ కోసం వాడు కోవాల‌ని కూడా ప్ర‌య‌త్నం చేశాడు. ఆఫ్ఘ‌న్ లో ఉన్న స‌హాజ వ‌న‌రుల‌ను పాక్ కు తీసుకు వ‌చ్చి పాక్ అప్పులు తీర్చాల‌ని అనుకున్నాడు. వీరి మ‌ధ్య స్నేహం కూడా బ‌లం గానే ఉండేది.


కానీ తాజా తాలిబ‌న్ల ప్ర‌తినిధి ఒక పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవి వీరి మ‌ధ్య సంబంధాలు తెచ్చే లా ఉన్నాయి. ఒక తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి ఒక ఛాన‌ల్ ఇంట‌ర్య్వూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ పై ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. ఇమ్రాన్ ఒక తోలు బొమ్మ లాంటి వాడు అని ఎద్దెవా చేశాడు. ఇమ్రాన్ అస‌లు ఎల‌క్టెడ్ ప్ర‌ధాని కాద‌ని సెల‌క్ట‌డ్ ప్ర‌ధాని అని విమ‌ర్శించారు. అంతే కాదు.. పాక్ ఆర్మీ చేతులో ఇమ్రాన్ ఒక ప‌ప్పెట్ మారి పోయాడాని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ గానీ పాకిస్థాన్ నాయ‌కులు గానీ ఆఫ్ఘాన్ విష‌యం లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని తెల్చి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఆఫ్ట‌నిస్థాన్ ను వాడు కోవాల‌ని ప్ర‌య‌త్నించాడని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ గెల‌వ‌డం క‌ష్ట మే అని అన్నారు. ఇలా తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి ఇలాంటి సంచాల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌జ‌లు అవక్కాయ్యారు. ఎది ఏమైనా వీరి వ్యాఖ్యలు పాక్ ప్ర‌ధానికి ఒక షాక్ లా ఉంటుంది అనేది నిజం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: