అమెరికాలో భారతీయుల హవా...ఆ రెండు విషయాల్లో మనమే టాప్

VAMSI
భారతీయులు వారి అభివృద్ది కోసం వివిధ దేశాలకు వెళుతూ ఉండడం తెలిసిందే. అయితే అన్ని దేశాల కన్నా కూడా అమెరికాలో భారతీయుల శాతం ఎక్కువని చెప్పాలి. రోజు రోజుకీ అమెరికాలో భారతీయ ప్రజల హవా ఎక్కువైపోతోంది. అమెరికాలో ఉన్న ఇండియన్స్ రెండే రెండు కారణాలతో అక్కడ నివసిస్తున్నారు. అందులో ఒకటి మంచి చదువులు మరియు ఎక్కువ సంపాదన. ఈ రెండే ప్రధాన లక్ష్యంగా ఎంతోమంది భారతీయులు అక్కడే ఉన్నారు. అందుకు తగినట్లే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు విభాగాల్లోనూ భారతీయ ప్రజలు తమ స్టామినా చూపిస్తున్నారు.
ఈ విషయంలో మహా మేధావులు తెలివి పరులు అనుకునే అమెరికా ప్రజలను సైతం వెనక్కు నెట్టేస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా వచ్చిన జనాభా గణన వివరాల ప్రకారం తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్ని అమెరికన్ పత్రిక తెలిపింది. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో ఒక కుటుంబం సగటు ఆదాయం చూస్తే 63,922 డాలర్లుగా ఉంది. ఇది కేవలం అమెరికా జనాభాకు సంబంధించిన కుటుంబం యొక్క సగటు ఆదాయం. అయితే భారతీయ కుటుంబ సగటు ఆదాయాన్ని చూస్తే 1,23,700 డాలర్లు ఉందట. అంటే రెండు రెట్లు ఆదాయంలో భారతీయులు ముందు ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆసియా దేశాల అందరిలోనూ ఇండియా వారే టాప్ లో ఉన్నారు.
అదే విధంగా విద్యారంగంలో చూసుకుంటే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రాడ్యుయేట్ ల శాతం 34 గా ఉండగా, భారతీయ అమెరికన్ గ్రాడ్యుయేట్ ల శాతం 79 శాతంగా ఉంది. అంటే దాదాపు రెండింతల కంటే ఎక్కువగా ఉంది. ఇలా అటు సంపదలోనూ విద్యారంగంలోనూ భారతీయ అమెరికన్ లే సత్తా చాటుతున్నారు. ముందు ముందు ఇంకెన్ని రంగాల్లో అమెరికా ప్రజలను తొక్కస్తారో చూడాలి. ఇంకా భవిష్యత్తులో పెద్ద పెద్ద స్థానాల్లో ఇండియన్స్ ఉండాలి అని అంతా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: