ఎన్నారైలకి కేంద్రం గుడ్ న్యూస్..?

Suma Kallamadi
కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయులకు శుభవార్త చెప్పింది. చదువు, ఉద్యోగం కోసం ఇతరదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) స్వదేశానికి వచ్చిన సమయంలో వారు ఆధార్ కోసం అప్లై చేసుకుంటే వారికి ఆధార్ రావడానికి కనీసం అంటే ఆరు నెలల టైం పట్టేది. ఈ క్రమంలోనే అనగా టైం ఎక్కువ అవుతుండటంతో వారు ఇబ్బందులు పడేవారు. కాగా, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సడలింపులిచ్చింది. కేంద్రం ఆదేశాల మేరకు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్న యూఐడీఏఐ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.




స్వదేశానికి వచ్చిన వారు వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఇండియన్ పాస్‌పోర్టు తప్పనిసరిగా జత చేయాలని పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ట్వీట్ చేసింది. ఎన్నారైలు ఇకపై ఆధార్ దరఖాస్తు కోసం 182 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని తేలింది. వర్కింగ్ ఇండియన్ పాస్‌పోర్టు ఉన్న వారికి తొందరగానే ఆధార్ వచ్చేస్తుంది. ఇందుకుగాను మొదలు దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. మరిన్ని వివరాలకుగాను 1947 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. లేదా help@uidai.gov.inకు క్వరీలు మొయిల్ కూడా చేయొచ్చు.





అయితే, అప్లికేషన్ నింపే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రవాస భారతీయులకు డిక్లరేషన్ అనేది సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదివిన తర్వాతనే డిక్లరేషన్ ఫామ్‌పైన సైన్ చేయాలి. తనను ఎన్నారైగా నమోదు చేయాల్సిందిగా ఆధార్ సెంటర్‌లో కోరాలి. ప్రూఫ్స్‌గా ఇండియన్ పాస్‌పోర్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే ఆధార్ సెంటర్ వారు బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. అక్‌నాలెడ్జ్‌మెంట్‌గా అప్లికేషన్ చేసినందుకుగాను 14 అంకెలతో ఉండే స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్ పైన ఉన్న నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: