అమెరికా దేశంలో భారతీయుడికి జైలుశిక్ష..?

Suma Kallamadi
అమెరికా దేశంలోని భారతీయలకు అరుదైన గౌరవం లభిస్తోంది. అమెరికాని శాసించే ఉన్నత హోదాలలో ఇండియన్స్ స్థానాలు సంపాదించుకుంటున్నారు. ఇక విద్యార్థులు, ఉద్యోగులు సైతం అమెరికాలో రాణిస్తున్నారు. దీంతో అమెరికాలో భారతీయుల పట్ల గౌరవం పెరిగిపోతోంది. కానీ ఈ నేపథ్యంలోనే అమెరికా దేశానికి వెళ్ళిన కొందరు భారతీయులు నేరాలకు, మోసాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. వీరివల్ల భారతీయులకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.
అయితే అమెరికా దేశం మాత్రం ఏ విదేశీయులు కూడా తమ దేశంలో మోసాలకు పాల్పడకుండా ఉండాలని.. భారీ ఎత్తున జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తోంది. ఇటీవల లవ్‌ప్రీత్ సింగ్ అనే ఒక భారతీయ వ్యక్తి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడు. అయితే, ఈ ఏడాది మార్చి నెలలో మనీలాండరింగ్ కేసులో అతడిని దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది . దీంతో అతడికి తాజాగా జైలు శిక్ష వేశారు. లవ్‌ప్రీత్ సింగ్ కి 15 నెలల జైలు శిక్షతో సహా మూడున్నర లక్షల రూపాయలు జరిమానా విధించామని న్యాయశాఖ తెలిపింది.
వృత్తిరీత్యా ట్రక్కు డ్రైవర్‌ అయిన లవ్‌ప్రీత్ సింగ్ అమెరికా, భారత దేశంలో భారీ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడు. అతడితో కలిసి మరో 9 మంది మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు విచారణలో తేలింది. అయితే 2015 - 2018 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ముఠా రకరకాల మోసాల ద్వారా కోట్ల రూపాయల్లో సంపాదించారని కోర్టు విచారణలో తేలింది. అయితే ఈ భారీ మోసాలకు పాల్పడే లవ్‌ప్రీత్ సింగ్‌ వద్ద చట్టవిరుద్ధంగా మారణాయుధం కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న న్యాయస్థానం మరింత ఆగ్రహం వెళ్లగక్కింది. అనంతరం 15 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు 3.50లక్షలు జరిమానా కట్టాల్సిందిగా తీర్పునిచ్చింది.
అయితే కేవలం ఐదు నెలల సమయం లోనే నిందితుడికి జైలు శిక్ష విధించడం గమనార్హం. ఇక కొందరు భారతీయులు అక్రమంగా అమెరికా దేశంలో నివసిస్తున్న జైలు పాలవుతున్నారు. డ్రగ్స్, హత్యలు వంటి నేరాల్లో కూడా భారతీయులు అరెస్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: