ఇదెక్కడి విడ్డూరం..'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చూసి అలా చేసిన టాలీవుడ్ జంట..?
ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవిలోని వింటేజ్ యాంగిల్, ఆయనకు మాత్రమే సొంతమైన టైమింగ్, హావభావాలు, ఎమోషనల్ డెప్త్ అన్నింటినీ అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవిని ఈ స్థాయిలో చూడటం సంతోషంగా ఉందని, కలెక్షన్లు కూడా ఆయన వింటేజ్ స్టామినాకు తగ్గట్టుగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇదంతా ఒకెత్తయితే, ఈ చిత్రంలో ఉన్న ఒక ఎమోషనల్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా చిరంజీవి తల్లి పాత్ర మరియు నయనతార పాత్ర మధ్య వచ్చే సంభాషణ ఎంతో మందిని ఆలోచనలో పడేసిందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఒక్క సన్నివేశం కారణంగా మూడు నెలలుగా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న ఒక టాలీవుడ్ జంట తిరిగి కలిసిపోయిందట.సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, వెంకటేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మెగాస్టార్ మాట్లాడుతూ,“మూడు నెలల నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న ఒక జంట ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా మళ్లీ ఫోన్ చేసుకుని మాట్లాడుకున్నారు. చివరికి ఇద్దరూ కలుసుకుని విడాకులు వద్దని నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ఈ సినిమాలో నా తల్లి పాత్ర నయనతారతో మాట్లాడే డైలాగ్స్ అని నాకు తర్వాత తెలిసింది” అని చెప్పారు.ఆ సన్నివేశంలో చిరంజీవి తల్లి పాత్ర చెప్పే మాటలు చాలా నిజాయితీగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే, అవి వాళ్లిద్దరూ కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ, మూడవ వ్యక్తి జోక్యం ఉండకూడదు అని ఆమె చెప్పే డైలాగ్స్ నేరుగా హృదయానికి తాకుతాయి. ఈ డైలాగ్స్ రాసినందుకు అనిల్ రావిపూడిని పలువురు “ సెల్యూట్” అంటూ ప్రశంసించారని మెగాస్టార్ తెలిపారు. అదే డైలాగ్ ఆ జంట విడిపోకుండా ఉండేందుకు కారణమైందట.
ఈ సన్నివేశానికి థియేటర్లలో నిజంగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు సినిమాల్లో అత్తా–కోడళ్ల అనుబంధాన్ని ఎక్కువగా గొడవలు, వాదనలు, విమర్శల కోణంలోనే చూపించారు. కానీ ఈ చిత్రంలో మాత్రం అత్తా, కోడలు ఒకరితో ఒకరు గౌరవంగా, ప్రేమగా మాట్లాడుకునే విధానాన్ని చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.“అత్తా–కోడళ్ళు ఇలా కూడా ఉంటారా? వాళ్ల మధ్య ఇంత ఆత్మీయత ఉండొచ్చా?” అనే ప్రశ్న చాలా మందిలో కలిగింది.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సన్నివేశాన్ని హ్యాండిల్ చేసిన తీరు నిజంగా ప్రశంసనీయం అని చెప్పాలి. కుటుంబ విలువలు, సంబంధాల ప్రాముఖ్యతను చాలా సహజంగా, బలవంతంగా కాకుండా కథలో భాగంగా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. కచ్చితంగా విడిపోయే దశలో ఉన్న జంట ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఒక్క క్షణమైనా ఆలోచించుకునే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే, ఈ అంశంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ఈ సన్నివేశాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుని, సినిమా సమాజానికి మంచి సందేశం ఇస్తోందని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని నెగిటివ్‌గా ట్రోల్ చేస్తూ, సినిమాలతో వ్యక్తిగత నిర్ణయాలను మార్చడం సరైనది కాదని విమర్శిస్తున్నారు.ఏదేమైనా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్దే కాదు, భావోద్వేగాల పరంగానూ ప్రేక్షకులను ప్రభావితం చేస్తోందని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం, బలమైన డైలాగ్స్ కలిసి ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా మలిచాయని చెప్పొచ్చు.