ఇండియన్స్ ని ఓడించిన ఆఫ్రికన్-అమెరికన్..?

Suma Kallamadi
అమెరికాలోని ఫోర్లిడాలో లేక్ బ్యూయేనా విస్టాలో జరిగిన "2021 స్ర్కిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ" ఫైనల్ లో లూసియానాకి చెందిన 14ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విన్నర్ గా నిలిచింది. గత 12 సంవత్సరాలుగా భారత సంతతికి చెందిన బాల మేధావులు చాంపియన్లుగా నిలుస్తున్నారు. ఐతే భారతీయుల విజయ పరంపరకు చెక్ పెట్టి అవంత్‌ గార్డే చరిత్ర సృష్టించారు. వాస్తవానికి గత 93 ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకమైన స్ర్కిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆఫ్రికన్-అమెరికన్లు ఈ పోటీలలో విన్నర్ గా నిలవలేదు. కానీ ఎట్టకేలకు ఆఫ్రికన్-అమెరికన్ జైలా అవంత్‌ గార్డే ఇండియన్ ని ఓడించి ఛాంపియన్‌‌గా నిలిచి చరిత్ర లిఖించింది. అంతేకాకుండా 50 వేల డాలర్ల (ముప్పై ఏడు లక్షల రూపాయలు) ప్రైస్ మనీ గెలుచుకుంది.
చివరి రౌండ్ లో అవంత్‌ గార్డే కాలిఫోర్నియాకు చెందిన చైత్ర తుమ్ములపై తలపడింది. అయితే మన భారతీయ అమ్మాయి “నెరోలి ఆయిల్ (neroli oil)” ను సరిగ్గా స్పెల్ చేయలేకపోయింది. మరొక పక్క అవంత్‌ గార్డే  “మూరాయా (murraya)” కరెక్ట్ గా స్పెల్ చేసి ఛాంపియన్ అయింది. ఈసారి ఫైనల్స్ కు 11 మంది ఎంపికయితే వారిలో 9 మంది భారత సంతతికి చెందిన పిల్లలే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా అవంత్‌ గార్డే ని ఓడించ లేకపోయారు.

ఇక ఈ ఆఫ్రికన్-అమెరికన్ కేవలం ఇంగ్లీష్ పదాలను స్పెల్ చేయడంలో మాత్రమే కాదు బాస్కెట్ బాల్ ఆడటం లో కూడా దిట్ట. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత మహిళల జాతీయ బాస్కెట్‌బాల్ సంఘంలో పోటీ చేస్తానని చెబుతోంది. స్పెల్లింగ్ అనేది తనకు జస్ట్ ఒక హాబీ లాంటిదని.. తన అసలైన లక్ష్యం బాస్కెట్‌బాల్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం అని మీడియాతో చెప్పుకొచ్చింది. ఇక చైత్ర తుమ్ముల ఫస్ట్ రన్నరప్ గా నిలవగా.. భావన మదిని సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: