అమెరికా: రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి ఇదే..?

Suma Kallamadi
సూపర్ స్టార్ రజనీకాంత్‌ జూన్ 19వ తేదీన తన సతీమణి లత తో కలిసి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  లో కనిపించారు. వీరిద్దరూ కలసి దుబాయ్ నుంచి అమెరికా కి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా దేశానికి వెళ్లిన రజనీకాంత్ వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులను కలుసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో తన స్నేహితులను కలుసుకోగా.. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ గా మారాయి.
రజనీకాంత్ 2016వ సంవత్సరంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన అడపాదడపా జనరల్ హెల్త్ చెకప్ కోసం అమెరికాకి వెళ్తున్నారు. ఈసారి ఆయన అత్యుత్తమ "మాయో క్లినిక్" లో వరల్డ్ క్లాస్ డాక్టర్స్ చేత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం స్నేహితులతో హాయిగా ముచ్చటిస్తూ కనిపించారు. దీంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టమవుతోంది. వైద్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన మాయో క్లినిక్ డాక్టర్లు కూడా రజనీకాంత్ ఆరోగ్యం చాలా బాగుందని వెల్లడించినట్లు తెలిసింది. మరో ఐదేళ్లపాటు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని రజినీకాంత్ కి సూచించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ రచయిత వైరాముత్తు తన స్నేహితుడు రజనీకాంత్ తో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా రజినీకాంత్ హెల్త్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. 'అమెరికా నుంచి రజనీకాంత్ ఫోన్ చేశారు. హెల్త్ చెకప్ సక్రమంగా పూర్తయిందని ఆయన నాతో చెప్పారు. ఆయన వాయిస్ వినగానే అతను చాలా ఆరోగ్యంగా ఉన్నారని నాకు అనిపించింది. అభిమానుల కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపోతే రజనీ కంటే ముందస్తుగా అల్లుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య.. కుమారులు యాత్ర, లింగలతో కలిసి అమెరికా వెళ్లారు. షూటింగ్ నిమిత్తం ధనుష్ గత కొద్ది నెలలుగా అమెరికా లోనే ఉంటున్నారు. 15 రోజుల క్రితం అమెరికా కి వెళ్ళిన రజినీకాంత్ తన అల్లుడు, కూతురుతో రీయూనియన్ అయ్యారు. జూలై నెల రెండో వారంలో ఆయన తిరిగి చెన్నై లోని తన నివాసానికి రానున్నారు. రజనీ "అన్నాత్తే" దీపాల పండుగ సందర్భంగా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: