పోలీసులు హతం.. ఎన్నారై ఇంట్లో ఘోరం?

Suma Kallamadi
క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్లను గన్నుతో కాల్చి చంపినందుకుగాను ఒక గ్యాంగ్ స్టార్ తో పాటు అతని ముగ్గురు సహచరులపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. శనివారం రోజు పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లా జాగ్రాన్ ప‌ట్ట‌ణంలోని న్యూ గ్రేయిన్ మార్కెట్ లో విధి నిర్వహణలో ఉన్న భ‌గ‌వాన్ సింగ్, ద‌ల్వీంద‌ర్ సింగ్ అనే ఇద్దరు ఏఎస్ఐలను కారులో వచ్చిన దుండగులు కాల్చి చంపారు.


ఐతే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన జైపాల్ భుల్లార్, అతని సహచరులు ఒక ఎన్నారై ఇంట్లో గత ఆరు నెలలుగా అద్దెకు ఉంటూ నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. కెనడా లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ కోతే బగ్గు గ్రామంలో ఉన్న తన అపార్ట్మెంట్ ని రెంట్ కి ఇచ్చారు. అయితే అదే అపార్ట్మెంట్ లో ఏఎస్ఐలను హతమార్చిన దుండగులు నివసిస్తున్నారని.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యానంతరం పోలీసులు పరిసర ప్రాంతాల్లో నిందితుల ముఖచిత్రాలకు సంబంధించి పోస్టర్లు అంటించడం ద్వారా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. బల్జీందర్ సింగ్ అనే ఒక నిందితుడు తమ గ్రామంలోనే నివసిస్తున్నాడని పోలీసులకి గ్రామస్తులు వెల్లడించారు. కానీ హత్యలు జరిగిన తర్వాత నిందితులు తిరిగి తమ గ్రామానికి రాలేదని పోలీసులకు తెలిపారు.



అయితే గ్రామస్తుల సమాచారం మేరకు ఎన్నారై అపార్ట్ మెంట్ కు చేరుకున్న పోలీసులు నిందితుడు నివసించిన గదిని పరిశీలించి నిందితులకి సంబంధించిన వస్తువులను సేకరించారు. నవంబర్ 2020 నుంచి నిందితులు ఎన్నారై అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు అని పోలీసులు మీడియాకి వెల్లడించారు. కెనడాలో నివసించే ఎన్నారై వివరాలు తెలుసుకోకుండానే అద్దెకు ఇస్తున్నారని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నామని.. నిందితులు నివసించిన కోతే బగ్గు గ్రామం చుట్టూరా కాపలా కాస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: