భారత్ కు అమెరికా నిపుణులు

Gullapally Venkatesh
మన దేశంలో ఇప్పుడు చైనా కు దీటుగా ఎదిగే విధంగా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. దక్షిణ ఆసియాలో చైనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ఆర్మీ విషయంలో చాలావరకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆధునిక ఆయుధాల విషయంలో భారత్ వెనుకబడి ఉంది అనే వ్యాఖ్యలు గత కొంత కాలంగా నిపుణులు ఎక్కువగా చేస్తున్నారు. చైనాతో పోలిస్తే మన వద్ద ఉన్న పరిజ్ఞానం చాలా తక్కువ అనే వ్యాఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత్ కొన్ని కీలక దేశాలతో ఒప్పందాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.
రాబోయే రెండు మూడేళ్లలో భారత్ ఆయుధాల విషయంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయుధాలు సరిగా లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే ఆవేదన కొంతమంది మాజీ ఆర్మీ అధికారులు కూడా వ్యక్తం చేశారు. అత్యాధునిక ఆయుధాలు కొంతమందికి మాత్రమే పరిమితమయ్యాయి అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి.
ఈ నేపధ్యంలో అమెరికా కూడా భారత్ కు ఆయుధాలు విషయంలో సహాయం చేయడానికి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చైనాను ఎలాగైనా సరే తొక్కి పెట్టాలి అని భావిస్తున్న అమెరికా సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే అమెరికాకు చెందిన కొంతమంది నిపుణులు భారత్ కు వచ్చే అవకాశం ఉందని భారత సరిహద్దులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకుని... అమెరికా సర్కార్ కు నివేదిక వచ్చే అవకాశాలున్నాయని  అంటున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చైనా విషయంలో కూడా కాస్త ఎక్కువగానే పరిశీలించవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆర్థిక రంగంలో గత 2,3 ఏళ్లుగా ఊహించని విధంగా ప్రగతి సాధిస్తోంది చైనా. అందుకే ఇప్పుడు అమెరికా చైనా విషయంలో సీరియస్ గా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: