జో బిడెన్ ని కంగారు పెడుతున్న మోడీ...?

Gullapally Rajesh
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ హవా కాస్త జో బిడెన్ ని ఇబ్బంది పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి జో బిడెన్ ప్రత్యర్థిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి దాదాపు మూడేళ్ల నుంచి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఇండియా వచ్చిన ట్రంప్... మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. దీనితో అమెరికాలో ఉన్న ఎక్కువ మంది గుజరాతీయులు ట్రంప్ కి అండగా నిలబడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి గుజరాత్ నుంచి ఎక్కువ మంది వ్యాపార వేత్తలు ఉద్యోగస్తులు అమెరికా వెళ్లారు. అదే విధంగా రాజస్థాన్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా ఎక్కువ మంది అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారందరూ కూడా ట్రంప్ కి భారీగా ఓట్లు వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలా మంది అమెరికా వెళ్లారు. వారందరూ కూడా ఇప్పుడు ట్రంప్ కి ఓటు వేసే అవకాశం ఉంది. వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. దీనితో జో బిడెన్ కి మోడీ హవా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అని అక్కడి రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పటం చాలా వరకు కష్టంగానే ఉంది. అయితే జో బిడెన్ కి మాత్రం అమెరికన్ల నుంచి ఎక్కువగా మద్దతు వ’స్తోంది. అయితే ఇండియన్స్ కు మాత్రం అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటం తో అసలు వారు ఎవరి వైపు మొగ్గుచూపుతారు ఏంటి అనేది చూడాలి. అయితే చాలా వరకు ఎన్నారైలు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: