వైరల్ వీడియో : పోలీసులని ఓ చిన్నారి అడిగిన ప్రశ్న..మనసున్న వాళ్ళని కదిలించాల్సిందే..!!!

VIKRAM

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన తరువాత జరిగిన పరిణామాలన్నీ అందరిని ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోనే ఉంది. రోజు రోజుకి అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు మిన్నంటుటున్న నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. అమెరికా వ్యాప్తంగా జార్జ్ కి మద్దతు వెల్లువలా వచ్చి పడుతోంది. జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి ఊహించని మద్దతు దొరకడంతో ట్రంప్ నిరసన కారులపై చర్యల విషయంలో ఒకడుగు వెనక్కి వేశారనే చెప్పాలి..చాలా ప్రాంతాలలో కర్ఫ్యూ ని సడలించినా కొన్ని చోట్ల కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది..ఈ క్రమంలోనే

టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో ఓ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడికి పెద్దఎత్తున నిరసన కారులు రావడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పోలీసు అధికారులని రంగంలోకి దించింది. ఈ నిరసనలలో తన తండ్రితో పాటు పాల్గొన్న ఓ చిన్నారి అక్కడి పోలీసులని చూస్తి ఏడుస్తున్న క్రమంలో ఓ అధికారి చిన్నారితో మాటలు కలిపాడు. ఈ సంఘటనని ఆమె తండ్రి వీడియో https://www.videogram.com/comic/bb963854-bfaa-4eae-bd0c-d88e9ffdafd2/తీయగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని కదిలిస్తోంది.

అమెరికా పోలీసు దళాలని చూసి కంగారు పడిన చిన్నారిని దగ్గరకి తీసుకున్న ఓ అధికారి ఎందుకు ఎదుస్తున్నావంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి బదులు చెప్పిన చిన్నారి మేము మీకు వ్యతిరేకంగా ఇక్కడికి నిరసనలు తెలిపడానికి వచ్చాము మీరు మమ్మల్ని చంపుతారా అంటూ రోదిస్తూ అడిగింది. ఆ చిన్నారి అడిగిన ప్రశ్నకి స్పందించిన అధికారి నువ్వు ఎలాంటి నిరసన అయినా తెలిపు మేము నిన్ను బాధపెట్టం అంటూ చిన్నారిని ఓదార్చాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఆ పసి హ్రుదాన్ని ఎంతగా ప్రభావితం చేసిందనాదానికి ఈ ఒక్క సంఘటన చాలు అంటూ వీడియో వీక్షించిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: