సికింద్రాబాద్ లో చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత విశాఖలో నాట్స్ నిత్యావసరాల పంపిణీ

Edari Rama Krishna

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే.  ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచంలో ఎవ్వరినీ వదలడం లేదు. చిన్న వయసు నుంచి వృద్దుల వరకు కరోనా ఎటాక్ చేస్తుంది.  ఇక కరోనా కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  భారత్ లో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎన్ ఆర్ఐలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.  ఎంతో మంది స్వచ్చంద సంస్థలు పేదవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

 

నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసిన నాట్స్  సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలు, అనాధలకు నాట్స్  ఉచితంగా పలుప్రాంతాల్లో  నిత్యావసరాలు, ఆహారం అందిస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని మంచికలలు అనే చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ ఉచితంగా  నిత్యావసరాలు పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి చొరవతో  పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ఈ మంచి పని చేపట్టింది. ఇప్పటికే నాట్స్ తెలుగునాట నిరుపేదల ఆకలిబాధలు విషయం తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తగు సాయం చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.
 
 
విశాఖలో నాట్స్ నిత్యావసరాల పంపిణీ :
తెలుగునాట లాక్‌డౌన్‌తో ఆకలిబాధలు పడే పేదలకు ఆకలితీర్చే ప్రయత్నాలు నాట్స్ ముమ్మరంగా చేస్తోంది. విశాఖ నగరంలో నాట్స్, గ్లో సంస్థతో కలిసి పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసింది. సేవే గమ్యం అనేది తన చేతల్లో చూపింది. విశాఖలోని షీలనగర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటో,లారీ డ్రైవర్లకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసింది.  గ్లో సంస్థ నుంచి వెంకన్న చౌదరితో పాటు నాట్స్ ప్రతినిధిగా సూర్యదేవర రామానాయుడు ఈ నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేశారు. కష్టకాలంలో తమకు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చి ఎంతో మేలు చేశారని డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: