షాకింగ్...హెచ్1బీ..ప్రీమియం వీసా ప్రాసెసింగ్ రద్దు.

Bhavannarayana Nch

అమెరికా వలస విధానానికి ఎప్పటి కప్పుడు అడ్డు కట్టవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది అయితే అందులో భాగంగానే  ప్రీమియం వీసా ప్రాసెసింగ్‌ను ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రకటించింది...అయితే ఈ ప్రాసెస్ ని మళ్ళీ తిరిగి “ఏప్రిల్ 2” నుంచి స్వీకరిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది

 

 అయితే ప్రీమియం వేసా ప్రాసెసింగ్ అంటే ఏమిటంటే “ధరఖాస్తుదారులు కొంత అధిక రుసుము చెల్లించి తమ హెచ్‌1బీ వీసా దరఖాస్తును వేగవతంగా పరిశీలించాల్సిందిగా యూఎస్‌సీఐఎస్‌ను కోరడమే ప్రీమియం ప్రాసెసింగ్‌”.  ప్రాసెసింగ్‌లో సమయాన్ని ఆదాచేసే ఉద్దేశంతో హెచ్1బీ ప్రీమియం వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపింది...మళ్ళీ కొనసాగింపు ప్రక్రియ అక్టోబరు 1న ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది...ఇదిలాఉంటే అమెరికా ప్రభుత్వం ఏటా 65 వేలకుపైగా హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది...2007-12 మధ్య కాలంలో అత్యధికంగా భారతీయుల నుంచి 2.12మిలియన్ల హెచ్1బి వీసా పిటిషన్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్‌కు అందాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: