బాహుబలి కొండల పైకి బాలయ్య !

Seetha Sailaja


ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆసినిమాలో నటించిన నటీనటులకు డిమాండ్ పెరగడమే కాకుండా ఆ సినిమాను చిత్రీకరించిన ప్రాంతాలకు కూడ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఇటువంటి సందర్భమే బాలకృష్ణ సినిమా విషయంలో జరుగుతోంది. 

బాలయ్య 99వ సినిమాగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిక్టేటర్’ సినిమాకు ‘బాహుబలి’ సెంటిమెంట్ పట్టుకుంది. ఎముకలు కొరికే చలిలో మైనస్ డిగ్రీ చలిలోబల్గేరియా ప్రాంతంలో ప్రభాస్ తమన్నాలు నటించిన బల్గేరియాలోని అరుదైన లొకేషన్ సీన్స్ ‘బాహుబలి’ సినిమాను చూస్తున్న ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఎత్తైన కొండల మధ్య మంచు దుప్పటిలా కప్పిన ప్రాంతంలో షూటింగ్ చేయాలి అంటే చాల కష్టం. 

అయితే అటువంటి కష్టాన్నే నందమూరి సింహం బాలకృష్ణ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘డిక్టేటర్’ టీమ్ బల్గేరియాలో ఉంది. ఈమంచు కొండల మధ్య ఒక భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యూరప్ లోని పలు అందమైన లోకేషన్స్ లో బాలయ్యా అతడి హీరోయిన్స్ అంజలి సోనాల్ చౌహాన్ లపై రొమాంటిక్ సాంగ్స్ ను తీయబోతున్నారని టాక్. 

బాలకృష్ణ తన సినిమా కోసం మైనస్ టెంపరేచర్ లో కష్టపడటం చూస్తూ ఉంటే ఎట్టి పరిస్తుతులలోను తన 99వ సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టాలని బాలయ్య ధృడంగా నిశ్చయించుకున్నట్లే కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: