వ్యభిచారం కేసులో టీవి ఆర్టిస్ట్

E. Rama Krishna
ప్రాస్టిట్యూషన్ కేసు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ముందుగా శ్వేతాబసు. తను నిజంగా ఆ వృత్తిలో చేసిందో లేదో తెలియదు కాని, తన పేరుని మాత్రం ఏదొక సందర్భంలో సౌత్ మీడియా వదలకుండా స్టోరిలను వేస్తుంది. ఈ మధ్య కాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ఆర్టిస్ట్ లపై పోలీసులు రైడింగ్ లు జరిపి, చాలా మందిని పట్టుకున్నారు. వారిలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువుగా ఉంటే, మరికొందరు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వారు కూడ ఇందులో ఇరుక్కున్నారు. అయితే పోలీసుల రైడింగ్ లు కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే కాకుండా, టెలివిజన్ రంగం వారిపై ఫోకస్ పెట్టింది. తాజాగా తెలుగు టీవి రంగంలోని సీరియల్స్ లో నటించే ఆర్టిస్ట్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టి మరీ, ఆ తరహా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే కేవలం మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇటువంటి ప్రాస్టిట్యూషన్ కార్యక్రమాలు ఎక్కువుగా జరుగుతాయనుకుంటే పొరబాటే. తాజాగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇటువంటి కేసులు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. హిందీ సీరియల్స్ లో నటించే పాపులర్ యాక్టర్ నికిషా అనే నటి, వ్యభిచారం చేస్తూ బాంద్రా పోలీసులకి దొరికిపోయింది. అయితే ఒకే నెలలో హిందీ సీరియల్స్ కి చెందిన నలుగు ఆర్టిస్ట్స్ లని పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు హిందీ బుల్లితెరలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇలా కలర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, బుల్తితెరలో నటించే యాక్టర్స్ పై పోలీసులు తీవ్ర నిఘా పెట్టడంతో, చాలా మంది ఈ తరహా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారంటూ పోలీసుల నివేదికలు తెలుపుతున్నాయి. ఏదేమైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏ రంగలోనైనా ఉండకుండా ఉండేందుకు పోలీసులు చేస్తున్న కృషి అమోఘమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: