పవన్ బాబాయ్ కి ఝలక్ ఇచ్చిన రామ్ చరణ్

E. Rama Krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లిటిల్ బాస్ రామ్ చరణ్ ఝలక్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇదంతా హుదూద్ తుఫాన్ బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జరిగింది తప్పితే, ప్రత్యేకంగా పక్కా ప్లాన్డ్ గా జరిగింది ఏమీ కాదు అని తెలుస్తుంది. అయితే హుధూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలయిన విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తూ, అక్కడ ప్రజలను పలువురు ప్రముఖలు పరామర్శిస్తున్నారు. వీరిలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడి వెళ్ళి, తుఫాన్ ప్రభావిత పరిస్థిలు ఎలా ఉన్నాయి వంటి పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి సైతం ఇదే బాటలో నడిచేందుకు అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సంసిద్దత వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్ లో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ.. అవసరమైతే నేనూ కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ ఈ వయస్సులోనే ఇటువంటి ప్రక్రుతి విపత్తు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడని పవన్ కళ్యాణ్ ఊహించలేదంట. రామ్ చరణ్ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేసినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ తన నిర్ణయంతో పవన్ బాబాయ్ ఆలోచనలకు ఝలక్ ఇవ్వడంమే కాకుండా, ఆశ్ఛర్యంలో ముంచెత్తాడని అంటున్నారు. హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదట విరాళం అందజేసింది రామ్ చరణే. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. ధన సహాయంతో పాటు మందులు, ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: