'రొమాంటిక్' హీరోయిన్ మీదే టాలీవుడ్ ఫోకస్..ఆ క్రెడిట్ పూరీదే..?

Kunchala Govind
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కు క్రేజ్ రావాలంటే చూడటానికి అందంగా ఉండాలి.. బోల్డ్ గా నటించే యాటిట్యూడ్ కావాలి. లిప్ లాక్స్ కి రొమాంటిక్ సీన్స్ కి సై అనాలి. వీటితో పాటు కాస్త యాక్టింగ్ కూడా చేయగలిగితే ఇక ఆ హీరోయిన్ కు అవకాశాలు వరుసగా వస్తుంటాయి.  ప్రస్తుతం 'రొమాంటిక్' హీరోయిన్ కేతిక శర్మ ఒక్కసారిగా తన లుక్స్ తో.. బోల్డ్ యాటిట్యూడ్ తో టాలీవుడ్ దర్శక, నిర్మాతలనే కాదు యంగ్ హీరోస్ ను ఆకర్షించిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.  

పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమాతోనే కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజయి జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పోస్టర్స్ ను చూసిన ప్రేక్షకులు ఎంత షాక్ అవుతు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిలిం మేకర్స్ మాత్రం ఇండస్ట్రీకి మరో హాట్ హీరోయిన్ వచ్చిందంటు...ఈ హాట్ గాళ్  ఎవరంటూ ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతేకాదు కేతిక యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని కూడా ఆరాలు తీస్తున్నారట. ఒకవేళ యాక్టింగ్ కనుక యావరేజ్ అని తెలిసినా చాలు తమ సినిమాలకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట దర్శక, నిర్మాతలు. పూరి స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి పర్ఫార్మరే అన్న కన్ క్లూజన్ కి వచ్చేస్తున్నారట. ఎందుకంటే పూరి హీరోయిన్ యాక్టింగ్ లో మినిమం గ్యారెంటి అన్న సంగతి తెలిసిందే.  

ఇక ఈ కేతిక గురించి మన ఫిలిం మేకర్స్ కంటే సోషల్ మీడియాలో నెటిజన్స్ కేతికను బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇన్స్టా గ్రాం లో హాట్ హాట్ ఫోటోలు పెడుతు జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇక పూరి 'రొమాంటిక్' సినిమా కనుక హిట్ అయితే ఈ బ్యూటికి ఫుల్ గా ఆఫర్లు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది అయితే కేతిక టాలీవుడ్ న్యూ సెన్సేషన్ అంటూ అంచనాలు వేస్తున్నారు. 'రొమాంటిక్' ఫస్ట్ షో పడి హిట్ అంటే మాత్రం కేతిక కి ఆఫర్స్ క్యూ కడతాయనడం లో అసలు సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: