పూరి జగన్నాథ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ..!
'ఇస్మార్ట్ శంకర్' సినిమా తో చాలా సంవత్సరాల తర్వాత అదరగొట్టే హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా కమిట్ అయి ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కి సూచించాడట. దీంతో ప్రస్తుతం రెండు నెలల పాటు విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ నేర్చుకోబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఇందు కోసం విజయ్ దేవరకొండ కి ఒక స్పెషల్ ట్రైనర్ ని దగ్గరుండి పూరి జగన్నాథ్ నియమించినట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కామెడీ ప్లస్ యాక్షన్ తరహాలో ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమా కోసం 'ఫైటర్' అనే టైటిల్ పెట్టాలని పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్లో కనబడుతున్న టాక్. కాగా రెండు నెలల్లో మొత్తం మార్షల్ ఆర్ట్స్ విజయ్ దేవరకొండ నేర్చుకున్నాక...సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి లో మొదలుపెట్టి సమ్మర్ కి కంప్లీట్ చేసి విడుదల చేసే ఆలోచనలో పూరిజగన్నాథ్ ఉన్నట్టు సమాచారం.