బిగ్ బాస్ కాలేజ్ టాస్క్ లో గాసిప్ అంటే ఎలా ఉంటుందంటే.. దుప్పట్లో వితికా, వరుణ్‌లు ఏం చేశారో చెప్తున్న శివజ్యోతి
అబ్బబ్బా.. డ్రామా ఆర్టిస్ట్‌లకు ఏమాత్రం తీసిపోకుండా పెర్ఫామెన్స్ ఇస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అందరి సంగతి అంటుంచితే బిగ్ బాస్ పాతాళ గంగగా పేరొందిన క్రైయింగ్ కంటెస్టెంట్ శివజ్యోతి పెర్ఫామెన్స్ బుధవారం నాటి ఎపిసోడ్లో హైలైట్స్.ఎపిసోడ్ తొలి భాగంలో బాబా భాస్కర్ తనను హర్ట్ చేశాడని గుక్కపెట్టి ఏడ్చేసిన శివజ్యోతి. రెండో భాగంలో తనలోని రెండో యాంగిల్‌ని చూపించింది. లగ్జరీ బడ్జెట్లో భాగంగా.. బిగ్ బాస్ కాలేజ్ అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో క్రేజీ టీజర్‌గా వితికా వీరలెవల్లో పెర్ఫామెన్స్ ఇస్తుంటే.. స్టూడెంట్స్‌గా శివజ్యోతి ఉంది.
స్టూడెంట్ను క్వచ్ఛన్స్ అడిగే ప్రయత్నంలో భాగంగా.. ఎవర్ని ఏ ప్రశ్న అయితే అడగకూడదో అదే ప్రశ్న శివజ్యోతిని అడిగేసింది వితికా. గాసిప్ అంటే ఏంటి అని శివజ్యోతిని వితికా అడగడంతో.. ఆమెలో ఉన్న ‘తీన్మార్ సావిత్రి’ ఒక్కసారిగా నిద్రలేచింది.గాసిప్ అంటే.. అంటూ మొదలుపెట్టిన శివజ్యోతి.. ‘పుకార్లు పుట్టించడం మేడమ్.. అన్నీ అటలే ఉంటాయి గాసిప్‌లో. ప్రస్తుతానికి ఈ గాసిప్‌లో మిమ్మల్ని వాడుకుంటా ఏం అనుకోవద్దు.
గాసిప్ అంటే ఎలా ఉంటుందంటే.. ‘వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ చేసిన తరువాత లోపల బిగ్ షీట్లో ఏమోనట అంటూ చేతిలో ఉన్న పెన్‌కి కేప్ పెడుతూ.. వితికా వరుణ్ని బాగా డబ్బులున్నాయనే చేసుకుందట’ అని తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది శివజ్యోతి. ఆమె పెట్టిన పుకారుకి తెల్లముఖం వేసిన టీచర్ వితికా.. బాగా చెప్పావ్ అమ్మా.. వెల్ డన్ అంటూ సాగనంపింది.