'సాహో' కు ఊహించిందే జరిగిందా......??

Mari Sithara
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవ్ సాహో, గత నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతక ముందు రెబల్ స్టార్, బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు మూవీస్ లో నటించి ఉండడం, అలానే ఆ సినిమాల తరువాత రెండేళ్లకు పైగా విరామం తీసుకోవడంతో సాహో సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మొదట ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఆపై బయటకు వచ్చిన ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమోలు వంటివి సినిమాపై ఆకాశమే హద్దుగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేసాయి. 

ఇక అటువంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో, ఆ అంచనాలు అందుకోవడంలో చాలావరకు విఫలమయింది. ఇక మొన్న వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో సాహో కు బాగానే కలెక్షన్స్ లభించాయి. అయితే ఆ తరువాత మంగళవారం నుండి ఈ సినిమాకు చాలా చోట్ల భారీగా డ్రాప్స్ మొదలయినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక ఓవర్సీస్ లో కొంతవరకు ఈ సినిమాకు డెఫిషిట్ పడే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ఇక నైజాం లో ఇప్పటివరకు ఈ సినిమా కేవలం అరవై శాతం మాత్రమే కలెక్షన్ రాబట్టిందని, అయితే రాబోయే రోజుల్లో అక్కడ మిగతా నలభై శాతం రాబట్టే అవకాశం చాలా వరకు తక్కువ అని అంటున్నారు. మరోవైపు ఈ రెండు ప్రాంతాలతో పాటుగా, 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా సాహో పరిస్థితి ఇలానే ఉందని సమాచారం. అలానే తమిళనాడులో కూడా కలెక్షన్స్ తగ్గుదల బాగా కనపడుతోందని, అయితే ముంబై వంటి నార్త్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమాకు పర్వాలేదనిపించేలా కలెక్షన్ వస్తున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ఇక మొత్తంగా బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందడంతో, ఏ మాత్రం సినిమా కనుక తేడా కొట్టినా, సినిమాను కొన్న బయ్యర్ల పరిస్థితి భయంకరంగా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అందరూ ఊహించిన విధంగానే ప్రస్తుతం సాహో పరిస్థితి నడుస్తుండడం నిజంగా దురదృష్టకరం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: