‘సాహెూ’లో ఆ సీన్లు ఫ్యాన్స్ పూనకాలే అట!

siri Madhukar
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘చత్రపతి’ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘మిర్చి’ ప్రభాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఇక రాజమౌళి తీసిన ‘బాహుబలి, బాహుబలి 2’ ప్రభాస్ రేంజ్ ని అమాంతం జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్లింది.  ప్రస్తుతం ప్రభాస్ నటించే ప్రతి సినిమాపై భారీ అంచనాలె పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆయన సినిమాల నిర్మాణం కూడా భారీ గా పెట్టుబడి పెడుతున్నారు. 

తాజాగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’సినిమాలో నటిస్తున్నాడు. లుగులోనే కాక ఈ సినిమాపై హిందీలో కూడా ఆకాశాన్నంటే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 30న సినిమా విడుదల ఉన్నా కానీ గురువారం అర్ధరాత్రి నుండే స్పెషల్ షోలకు పర్మిషన్ లభించడంతో సందడి మొదలవుతుంది. ఇప్పటికే బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో టికెట్లు పెట్టిన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. తాజాగా ఈ మూవీలో హైలెట్ సీన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


. వీటిల్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి. ఫ్యాన్స్ గూస్ బంప్స్ అయ్యేలా ఈ సీన్ ఉంటుందని సమాచారం. ఇక రెండో సీన్ విషయానికి వస్తే, గన్ ఫైట్. దీన్ని బాబ్ బ్రాన్ డైరెక్ట్ చేశాడు. మూడో సీన్ ఈ సీన్స్ కోసం మరో ఇంటర్నేషనల్ డైరెక్టర్ కెన్నీ బ్యాట్స్ డైరెక్ట్ చేశారు. దీన్ని మూడు వారాల పాటు అబూదాబీలో షూట్ చేశారు. ఇక సాహెూలో హైటెల్ సీన్ జెట్ మ్యాన్ సీన్. 'బాహుబలి-2' ప్రీ రిలీజ్ లో విడుదల చేసిన టీజర్ లోనే చూపించారు. ఈ సీన్స్ ఇటలీలో షూట్ చేశారు. జెట్ సూట్ వేసుకుని ప్రభాస్ గాల్లో తేలిపోతూ అద్భుతంగా నటించారట.

ఇక ఈ మూవీకి ప్రాణం..ఒళ్లు గగుర్బొడిచే సన్నిశం..ఫ్యాన్స్ సీట్ల టెన్షన్ గా అతుక్కుపోయే సన్నివేశం క్లయిమాక్స్.  హాలీవుడ్ లో భారీ ఆకారాలతో పెద్ద పెద్ద విలన్లు ఎలా కనిపిస్తారో ఈ మూవీలో అలా కనిపించబోతున్నారట. రోయిజం పీక్స్ లో ఉండి, అభిమానులను అలరించేలా చిత్రం ముగింపు ఉంటుందట. ఇక ఈ సీన్స్ రియల్ గా ఫ్యాన్స్ ను ఎలా అలరిస్తాయో తెలియాలంటే 30 వరకు ఆగాల్సిందే అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: