కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాహో..!

KSK
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో భారతదేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఈ సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బడ బడ డాక్టర్లు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అంచనాలు భీభత్సంగా పెట్టుకుంది. ఒకపక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టోరీలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ డైరెక్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో సాహో సినిమా హిందీలో చేయటంతో ప్రభాస్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాపు అవుతుందా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైన క్రమంలో కేవలం 28 నిమిషాల్లోనే 100K(లక్ష) లైక్స్ వచ్చేసాయి.


ఇంత తక్కువ సమయంలో ఇన్ని లైక్స్ రావడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి. అప్పట్లో ప్రభాస్ నటించిన “బాహబలి2” ట్రైలర్ కే ఈ ఫీట్ అందుకోడానికి 73 నిముషాలు పట్టింది.ఇప్పుడైతే మొట్టమొదటి స్థానంలో “సాహో” రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత వీర రాఘవ” ట్రైలర్ 67 నిముషాలు ఆ తర్వాత “బాహుబలి 2″లు మూడవ స్థానంలో నిలిచాయి.


దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు “సాహో” జనం ఎలా ఎదురు చూస్తున్నారు అన్నది.మరి సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తంమీద సినిమా విడుదల కాకముందే కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30వ తారీఖున విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ట్రైలర్ విడుదల కావటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: