‘మహానటి’ తర్వాత మరో మూవీ అనౌన్స్ చేశాడు!

siri Madhukar
టాలీవుడ్ లో అదృష్టం కలిసి వస్తే రాత్రి రాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవొచ్చు.  కాకపోతే అది ఎవరో ఒక్కరికే అలాంటి అదృష్టం కలిసి వస్తుంది.  ఇటీవల పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ క్రేజీ హీరోగా మారారు.  ఇక గీతాగోవిందం సినిమాతో ఏకంగా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అని చెబుతున్నారు. 

ఇక ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్లుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.  ఈ లీస్ట్ లో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉన్నారు. మొదటి సినిమా నాని, విజయ్ దేవరకొండతో తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో మంచి విజయం అందుకున్న నాగ్ అశ్విన్ తర్వాత మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని తీసిన ‘మహానటి’ తెలుగు, తమిళ నాట బాక్సాఫీస్ షేక్ చేసింది.  అంత  గొప్ప కళాకారిణిపై ఎలాంటి నెగిటీవ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించారు నాగ్ అశ్విన్. 

ఇక సావిత్రి పాత్రలో మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించిందీ అనే కన్నా జీవించింది అని చెప్పొచ్చు.  ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసంలు వచ్చాయి.  ఈ సినిమాతో కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా హిట్ తర్వాత నాగ్ అశ్విన్ తో ఎంతో మంది హీరోలు తమ సినిమాకు దర్శకత్వం వహించాలని చెప్పినా...సున్నితంగా తిరస్కరించారట.

కాకపోతే ఆ మద్య వైజయంతి బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీస్తున్నారని వార్తలు వచ్చినా..సెట్ పైకి రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్  తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించనుంది.  అయితే ఈ మూవీకోసం రైటర్స్, విజువల్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్ కొత్తవారు కావాలంటూ ప్రకటనను ఇచ్చింది నిర్మాణ సంస్థ. ఆసక్తి ఉన్నవారు vymtalent@gmail.com మెయిల్‌కు బయోడేటా పంపాలని సూచించారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది.
We Are Building Something Big!!!
Calling Visual Artists, Designers & Writers to come on-board for this exciting new journey.
The adventure begins in Sept 2019.
A Film by @nagashwin7
Get in touch - vymtalent@gmail.com pic.twitter.com/VaP0AAcMIm

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 7, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: