మరో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చిన "ది ఫ్యామిలీ స్టార్"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించాడు . గతంలో విజయ్ , పరుశురామ్ కాంబోలో రూపొందిన గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా గీత గోవిందం అంచనాలు ఏ మాత్రం అందుకోలేకపోయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయన్ని ఎదుర్కొన్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే తెలుగు మరియు తమిళ భాషల్లో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ తెలుగు వర్షన్ చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. తమిళ వెర్షన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇ

కపోతే తాజాగా ఈ మూవీ మరో రెండు భాషల్లో ఓ టీ టీ లోకి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ కన్నడ , మలయాళ భాషలలో కూడా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ్ డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా యొక్క కన్నడ , మలయాళ డిజిటల్ హక్కులను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కన్నడ , మలయాళ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: