ఏపీ: ఈసారి ఎన్నికల్లో అదే చాలా ప్రత్యేకం.. రాష్ట్రాన్ని ఏలుతున్నారే..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడూ ఒక ఆసక్తికర అంశంగా నిలుస్తాయి. ఈ రాష్ట్రంలో నెపోటిజం కూడా ఎక్కువే. అంటే ఒకరు రాజకీయ నేత అయితే వారి కుమారులు కూడా పాలిటిక్స్‌లో అడుగు పెడుతుంటారు. ఈసారి అలా రాజకీయాలు అడుగుపెట్టిన వారసులు ఏకంగా ఎనిమిది మంది ఉన్నారు. ఏపీకి చెందిన ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వారసులు 2024 ఎన్నికలలో తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటున్నారు.
వైఎస్ఆర్ ఏకైక కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. 2010 డిసెంబరులో ఎంపీ పదవికి రిజైన్ చేశారు. 2011లో ఉపఎన్నికలకు వెళ్లి అక్కడ కూడా గెలుపు బావుటా ఎగురవేశారు. 2014, 2019 ఎన్నికలలో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి మళ్లీ అక్కడి నుండి పోటీ చేస్తున్నాడు.ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ 2014, 2019 ఎలక్షన్లలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో హిందూపురం నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. హిందూపురంలో 1985-1994 వరకు ఎన్టీఆర్ గెలుస్తూ వచ్చారు బాలకృష్ణ కూడా అలానే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఏమవుతుందో చూడాలి.
నందమూరి వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసే విజయం సాధించారు. 2009లో విశాఖ ఎంపీగా పోటీ గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పడడం వల్ల ఆమె కాంగ్రెస్ నుంచి వీడి 2014లో బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ నుంచి పోటీ చేసి అపజయం పాలయ్యారు. 2023, జులై 4న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టారు. ఈసారి రాజమండ్రి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్నారు.
నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా పని చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి నుంచి 2004, 2009 ఎన్నికలలో పోటీ చేసి మనోహర్ గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2018లో జనసేన కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు. ఇప్పుడు కూడా  తెనాలి నుంచే జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు.మరో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా గెలిచి కేంద్రంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం డోన్ శాసనసభ స్థానం నుండి పోటీ చేస్తున్నాడు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రాంకుమార్ రెడ్డి 2024 ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: