'విజయ్ సేతుపతి' తప్పుకోలేదు.. అది ఫేకే !

Chathurvedh Siva

మెగా మేనల్లుడు  వైష్ణ‌వ్‌ తేజ్ 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి  సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడైన  వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు   నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం చేస్తూ  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే  విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి  ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.  కాగా తాజాగా విజయ్‌ సేతుపతి  ఈ సినిమా నుండి తప్పుకొన్నట్ల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


డేట్స్‌ కుదరకపోవడంతోనే  విజయ్‌ సేతుపతి సినిమా నుండి తప్పుకుంటున్నారని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక బృందం సమాచారం ప్రకారం..  విజయ్ సేతుపతి  ఈ మూవీ నుండి తప్పుకోలేదని.. త్వరలోనే ఆయన షూట్ లో పాల్గొంటారని చెబుతుంది. ఇక ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పని చేస్తుండటం విశేషం.  'రాక్ స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి  సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే 'రంగస్థలం' ఫేమ్  రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను  చూసుకుంటుండగా...  నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. 


బుచ్చిబాబు సానా  ఇంతకు ముందుసుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌ గా కూడా పనిచేశారు.  ఇప్పటికే కీలక సన్నివేశాలను షూట్ చేసిన చిత్రబృందం  అవుట్ ఫుట్ పరంగా చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇక విజయ్ సేతుపతి రోల్ సినిమాలో హైలెట్ గా మిలుస్తోందని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతికి  తమిళ పరిశ్రమలో మంచి పేరుంది.  తమిళంలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే తెలుగులో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు ఈ వినూత్న నటుడు. ప్రతిష్టాత్మక 'సైరా' మూవీలో పోరాట వీరుడిగా ఆయన ఓ ముఖ్య పాత్రలో  నటిస్తున్నారు.   

   




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: