భార్య వలనే ఆ డైరెక్టర్ హిట్ కొట్టాడు..

Balachander
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వస్తుంటారు.. పోతుంటారు.  కొంతమంది మాత్రమే స్టాండర్డ్ గా నిలబడతారు.  అలా నిలబడాలి అంటే.. టాలెంట్ ఉండాలి.  అందరికి టాలెంట్ ఉంటుంది అనుకుంటే పొరపాటే.  వారసులుగా వచ్చినా కొందరికే టాలెంట్ ఉంటుంది.  ఆ కొందరే ఇండస్ట్రీలో నిలబడతారు.  అలాంటి వ్యక్తులు లెక్కేస్తే చాలా తక్కువగా ఉంటారు అనడంలో సందేహం లేదు.  దర్శకరత్నగా పేరు తెచ్చుకున్న దాసరి కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా నిలబడలేకపోయారు.  


దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి 2004లో నీతో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు.  ఆ సినిమా పెద్దగా ఆడలేదు.  ఆ తరువాత బొమ్మలాట, అననగానగా ఓ ధీరుడు సినిమా చేశారు.  ఇందులో అనగనగ ఓ ధీరుడు జానపద చిత్రం.  మేకింగ్ బాగుందని టాక్ వచ్చినా సినిమా పరంగా మాత్రం హిట్ కాలేదు. ఇండస్ట్రీలో వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు కొడుకు ఒక్క సినిమా కూడా హిట్ కొట్టకపోవడంతో...ఇక అంతేనేమో అనుకున్నారు.  


కానీ, అతన్ని జడ్జిమెంటల్ హై క్యా సినిమాతో హిట్ పలకరించింది.  టాలీవుడ్ లో హిట్ కోసం ప్రయత్నిస్తే... బాలీవుడ్ లో హిట్ దొరకడం విశేషం.  జడ్జిమెంటల్ హై క్యా సినిమాకు కథ సహకారం అందించింది కనికా.  ఈమె ఎవరో కాదు ప్రకాష్ కోవెలమూడి భార్య.  రచయితగా ఇండస్ట్రీలో మంచిపేరు తెచ్చుకుంది.  కథను సిద్ధం చేసుకున్నాక కంగనాకు కథను చెప్పి ఒప్పించింది.  దీంతో ప్రకాష్ కు సినిమా చేయడం సులభం అయ్యింది. 


ఈ సినిమాకు ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అప్లాజ్ వస్తోంది.  క్రిటిక్స్ పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినా... కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుండటం విశేషం.  మొదట సినిమాకు మెంటల్ హై క్యా అనే టైటిల్ అనుకున్నా తరువాత జడ్జిమెంటల్ హై క్యా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.  బాలీవుడ్ లో ఈ సినిమా విజయం సాధించడంతో ప్రకాష్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి .  తండ్రి  రాఘవేంద్ర రావుకు మంచి పేరు ఉన్నా... ప్రకాష్ కోవెలమూడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: