నాని సహజ నటుడు. అందుకు సందేహం లేదు. అయన ప్రతి సినిమా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ హీరో నటించిన జెర్సీ సినిమా సూపర్ హిట్టైంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
జెర్సీ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారు. దీనిని తమిళ్ లో రానా ప్రొడ్యూస్ చేస్తున్నారు. విష్ణు విశాల్ ఈ సినిమాలో నాని రోల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రానా అనేక చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహారిస్తుండటం విశేషం.
క్షణం సినిమా దర్శకుడితో రానా సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాధ్, సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వచ్చిన ఓ బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. దీనికి రానా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఓ బేబీ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తే... బాలీవుడ్ లో సమంత ప్లేస్ లో అలియా భట్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.