రెస్టారెంట్ లో బయటపడ్డ విజయ్ దేవరకొండ రష్మికల ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ !

Seetha Sailaja
టాలీవుడ్ సెన్సేషన్ గా విజయ్ దేవరకొండ రష్మిల జంట సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ‘గీత గోవిందం’ సినిమా అందరికీ తెలియచేసింది. ఈమూవీ తరువాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగి పోయింది అంటూ వార్తలు కూడ వచ్చాయి. 

అంతేకాదు వీరిద్దరి సాన్నిహిత్యం వల్లనే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం రద్దయిందని అన్న వార్తలు కూడ వచ్చాయి. దీనితో వీరిద్దరూ పైకి చెప్పక పోయినా ప్రస్తుతం పీకలలోతు ప్రేమలో ఉన్నారు అంటూ వస్తున్న వార్తలకు మరోసారి 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' మూవీ కారణం అయింది. 

వీరిద్దరూ మరికొంతమందితో కలిసి ఎ ఎమ్ బి మాల్ లో ‘ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ’ మూవీని ఆ సినిమా యూనిట్ తో కలిసి చూడటమే కాకుండా ఆతరువాత జూబ్లీహిల్స్ లోని ఒక రెస్టారెంట్ కు వెళ్ళి తెగ హడావిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రెస్టారెంట్ లో వీరిద్దరి సాన్నిహిత్యం చూసిన వారు విజయ్ రష్మికలు నిజంగానే ప్రేమించుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా సినిమా ఫంక్షన్లు ఇతర ఈవెంట్లకు రష్మిక కాంటాక్ట్ లెన్సులు పెట్టుకొని వస్తుంది.  కానీ ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళజోడు పెట్టుకుంటుంది. నిన్న విజయ్ తో రష్మిక చేసిన హడావిడిలో రష్మిక తన కళ్ళజోడుతో చాల సాదాసీదాగా ఎటువంటి మేకప్ లేకుండా రావడం చూసిన వారు వీరిద్దరి మధ్య ప్రస్తుతం నడుస్తున్నది జస్ట్ ఫ్రెండ్ షిప్ అయి ఉండకపోవచ్చని మరేదో ఉందని అంటున్నారు. ఎదిఎమైనా నిన్నటి రోజున విజయ్ రష్మికల ఆఫ్ స్క్రీన్ సాన్నిహిత్యం
వీరిద్దరి పై వస్తున్న రూమర్లకు మరిన్ని సందేహాలకు తావు ఇస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: