రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ రెజీనా..!
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్న బ్యూటీ రెజీనా. నటిగా కొన్ని మంచి విజయాలనే తన ఖాతాలో వేసుకున్నా, ఎందుకనో స్టార్ హీరోయిన్ రేంజ్‌ని తెచ్చుకోలేకపోయింది. అయితే రెజీనాపై వదంతులు మాత్రం జోరుగానే సాగుతుండటం విశేషం. 26 ఏళ్ల ఈ బ్యూటీకి గత 13వ తేదీన వివాహ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ట్రేండింగ్ వార్త.
ప్రస్తుతం అవకాశాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని రెజీనా నిర్ణయించుకున్నట్లు టాక్. దీంతో ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి త్వరలో పెళ్లి పీటలెక్కడానికి తొందర పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రెజీనా నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. చూడాలి మరి కాలమే దీనికి సమాధానం చెబుతుంది.
ఈ ముద్దుగుమ్మ ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రపంచం కోడై కూస్తోంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే యువ నటుడు సందీప్‌కిషన్‌తో మొదట్లో రెజీనా ప్రేమ కలాపాలు సాగించినట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ మధ్య ఒక భేటీలో రెజీనా పేర్కొంటూ తన జీవితంలోకి ప్రేమ వచ్చి పోయిందని చెప్పింది.
ఇక ఈమె కోలీవుడ్‌లో నటించిన నెంజమం మరప్పదిల్లై, దర్శకుడు వెంకట్ ప్రభు నిర్మించిన పార్టీ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు కాచుకున్నాయి. ఇకపోతే శింబుదేవన్ దర్శకత్వంలో వెంకట్‌ప్రభు నిర్మిస్తున్న కచడదపర అనే మరో చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తెలుగులో దురదృష్టం వెంటాడిన ఈ అమ్మడుకి తమిళులు బ్రహ్మరధం పెడతారేమో చూడాలి మరి!