నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
అంతేకాకుండా చెర్రీ హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఆమె RRR మూవీ నుండి వైదొలగింది. ఎన్టీఆర్ జోడీ క్యారెక్టర్ కు సూటబుల్ ఆర్టిస్ట్ దొరకడం లేదు. స్క్రిప్ట్ ను మార్ఛి ఇండియన్ ఆర్టిస్ట్ ను ఆ క్యారెక్టర్ కు ఎంపిక చేయ వచ్చనే సలహాను రాజమౌళి తిరస్కరించారు.
స్క్రిప్ట్ లో ఏ ఒక్క మార్పు చేయడం కుదరదని, ఒకరి కోసం స్టోరీని మార్చే ప్రసక్తే లేదు..త్వరలోనే ఆ క్యారెక్టర్ కు తగ్గ ఆర్టిస్ట్ ను ఎంపిక చేస్తామని రాజమౌళి తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న RRR మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అనేక అంచనాలు నెలకొన్నాయి.