ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!

KSK
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ కుర్ర హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా ఇటీవల రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా  'ఇస్మార్ట్ శంకర్' సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


అయితే తాజాగా మే 17 తారీకు చార్మి పుట్టినరోజు సందర్భంగా రామ్ పోతినేని నిర్మాత చార్మికి..గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హీరో రామ్ ట్విట్టర్ లో ఛార్మి కి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ..బాస్ లేడి అని సంబోధిస్తూ ఏ బాస్ లేడీ డస్ నాట్ కౌంట్ హర్ ఏజ్...శీ ఓన్లీ Counts హర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అని మెసేజ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ గిఫ్ట్ గా కూడా ఇచ్చాడట రామ్.


దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఇది పెద్ద వైరల్ గా మారింది. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి సరైన హిట్ లేని నేపథ్యంలో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎప్పుడూ చేయని విధంగా కొత్తరకం పాత్రలో రామ్ నటించడం జరిగింది. చాలా ఊర మాస్ తరహాలో రామ్ క్యారెక్టర్ని బాడీ లాంగ్వేజ్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త రకం లో తీర్చిదిద్దడం తో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు పూరి, రామ్.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: