నాగార్జున కండిషన్స్ కు తలవొగ్గిన బిగ్ బాస్ ౩ నిర్వాహకులు !

Seetha Sailaja
ఈ సంవత్సరం సమ్మర్ లో ప్రారంభం కావలసిన ‘బిగ్ బాస్ 3’ షో హోస్ట్ విషయంలో ఏర్పడిన సమస్యలు ‘స్టార్ మా’ యాజమాన్యానికి గతంలో ఎప్పుడూ ఏర్పడలేదు. గత సంవత్సరం ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాని సామర్ధ్యం అందరికీ నచ్చకపోవడంతో అనేక పేర్లు పరిశీలించిన తరువాత ప్రస్తుతం ఇజ్రాయల్ లో ఉన్న నాగార్జునను కలవడానికి ‘స్టార్ మా’ యాజమాన్యం ప్రత్యేకమైన వ్యక్తులను పంపించి నాగ్ ఈ షోకు హోస్ట్ చేసే విధంగా చాల కష్టపడి అతడి అంగీకారాన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నాగార్జున ఈ షో విషయంలో కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. ‘బిగ్ బాస్ 3’ షో సెట్ ను తన అన్న పూర్ణా స్టూడియోస్ లో వేయాలని బయట ఊళ్లకు వచ్చి తనకు షో నిర్వహించే ఖాళీ లేదనీ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ షోను హోస్ట్ చేసినందుకు తనకు పారితోషికంగా 15 కోట్లు పారితోషికం కావాలనీ నాగ్ పెట్టిన కండిషన్స్ కూడ అంగీకరించినట్లు టాక్. 

ఈనెల మూడవ వారంలో నాగార్జున తన ‘మన్మధుడు 2’ షూటింగ్ ముగించుకుని ఇజ్రాయిల్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత ఈవిషయమై స్టార్ మా నాగార్జునతో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ షో ప్రారంభం విషయంలో మరో అడ్డంకి ఏర్పడినట్లు సమాచారం. 

జూన్ నెల నుండి క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో లండన్ లో జరిగే ఈ పోటీల ప్రత్యక్ష ప్రసారం మన భారతీయ కాలమాన ప్రకారం మధ్యాహ్నం నుండి అర్దరాత్రి వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. దీనితో వరల్డ్  కప్ పోటీలు ముగిసిన తరువాత జూలై వేల చివరి నుండి ‘బిగ్ బాస్ 3 షో ప్రారంభం అవుతుందని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: