‘మహర్షి’ తరవాత అల్లరి నరేష్ పరిస్థితి ఏంటి ?

KSK
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లరి నరేష్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అవడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అల్లరి నరేష్ కెరియర్లో ఎటువంటి క్యారెక్టర్ తరవాత రాబోయే రోజుల్లో చేస్తాడో అన్న సందిగ్ధత ప్రతి ఒక్కరిలో నెలకొంది.


గతంలో కామెడీ సినిమాలు చేసిన అల్లరి నరేష్ కి గత కొంత కాలం నుండి సరైన హిట్లు లేని నేపథ్యంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రయోగాత్మకంగా ఒకసారి హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మహర్షి లో అల్లరి నరేష్ నటించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో అల్లరి నరేష్ పాత్రకు మరియు ఆయన నటనకు చాలామంది ఫిదా అయిపోవడంతో ఇండస్ట్రీలో అల్లరి నరేష్ ను హీరో గా చూడటం కొద్దిగా కష్టమే అని కామెంట్లు వినబడుతున్నాయి.


ఇండస్ట్రీలో హీరోలుగా నటించిన వాళ్లు క్యారెక్టర్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. కానీ వయసు మళ్లాక హీరోగా మార్కెట్ పూర్తిగా దెబ్బ తిన్నాక ఆ పాత్రల వైపు వెళ్తుంటారు. జగపతిబాబు శ్రీకాంత్ రాజేంద్రప్రసాద్ ఇలా చాలామంది ఈ కోవలోని వాళ్లే. కానీ హీరోలుగా వాళ్లు నరేష్ తో పోలిస్తే లాంగ్ కెరీర్ చూశారు. కాబట్టి ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి.. ఇంత తక్కువ వయసులోనే క్యారెక్టర్ రోల్స్ కు పరిమితం కావడం అంటే కష్టమే. మరి మహర్షి వల్ల వచ్చిన పేరుతో హీరోగా నరేష్ కెరీర్ కు ఏమైనా కలిసొస్తుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: