మరీ ఇంత అభిమానమా..బాబోయ్!

Edari Rama Krishna
స్టార్ హీరోలంటే అభిమానులకు ఎంతగానే ప్రేమిస్తారు.  వారి కోసం అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నో సమాజ సేవలు కూడా చేస్తుంటారు.  ఇక తమ అభిమాన హీరోల చిత్రాలు రిలీజ్ అంటే..ఇక ఆ హంగామాకు మామూలో జోష్ ఉండదు.  తాజాగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 

అయితే ఓ అభిమాని మాత్రం బాలకృష్ణ మీద తన అభిమానాన్ని మరీ వెరైటీగా చాటుకున్నాడు.  తన కుమారుడి పెళ్లి శుభలేఖపై అభిమాన హీరో ఫొటోను ముద్రించి బాలయ్య అంటే తనకెంత ఇష్టమో నిరూపించాడు.ఈ నెల 13న జరగనున్న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై ఆశీర్వదించాలని కోరాడు. 

బాలకృష్ణ చిత్రాల నుంచి రక రకాల స్టిల్స్ గెటప్స్ ఫోటోలను శుభలేఖపై ముద్రించాడు. అంతేకాదు, నూతన దంపతులకు బాలయ్యబాబు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఫొటోల కింద రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి శుభలేఖను చూసిన బాలయ్య అభిమానులు పొంగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: